'ఏం డాక్టరయ్యా అతను.. తీసుకెళ్లి లోపలేయండి. అరెస్ట్ హిమ్'. ఓ డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. సమస్యలను చెప్పినందుకు గిరిజన డాక్టర్‌పై ఇలాగేనా ప్రవర్తించేది అంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అసలేం జరిగిదంటే... గుంటూరు జిల్లా నరసరావుపేటలో గురువారం కోవిడ్ సమీక్షా జరిగింది. కరోనా కట్టడి చర్యలపై జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్ నరసరావుపేటలో సమీక్ష నిర్వహించారు. ఈ సమవేశంలో అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. కరోనా కట్టడిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని వైద్యులను అడిగారు కలెక్టర్. వెంటే నాదెండ్ల పీహెచ్సీ డాక్టర్ సోమ్లా నాయక్ లేచి సమస్యల గురించి మాట్లాడారు. ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీ లేదని ఆయన చెబితే.. ఎవరూ చెప్పారు లేవని అన్ని చోట్లా బెడ్స్ ఖాళీగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు.
ఇది సరైన సమాధానం కాదని డాక్టర్‌ను వారించారు. తాను అబద్ధం చెప్పడం లేదు వాస్తవమని ఆ డాక్టర్ చెప్పారు. ఉద్యోగం చేతకాకపోతే వదిలేయమని కలెక్టర్ అనడంతో.. ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. డాక్టర్ తీరుపై కలెక్టర్ శ్యామ్యూల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను సస్పెండ్ చేయాలని ఆదేశించడంతో.. నన్ను సస్పెండ్ చేయడానికి మీరెవరని డాక్టర్ ప్రశ్నించారు. ఆయనపై మండిపడిన కలెక్టర్.. ''వాట్ నాన్సెన్స్. ఏం డాక్టర్ ఇతను. ఎక్కడయ్యా ఆ డాక్టర్. తీసుకెళ్లి లోపల పడేయండR. నన్ను హూ ఆర్ యూ అంటావా? ఇతనిని అరెస్ట్ చేయండి వెంటనే. విపత్తు నిర్వహణ సెక్షన్కింది అరెస్ట్ చేయండి. ఈ ఏరియా ఎస్ఐ ఎవరు? ఇతనిని వెంటనే సస్పెండ్ చేయండి.'' అని ఆదేశించారు.
సమావేశం నుంచి బయటకు వచ్చిన డాక్టర్ సోమ్లా నాయక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఐదు గంటల పాటు అక్కడే ఉంచుకొని రాత్రి 9 గంటల తర్వాత పంపించారు. ఎమ్యెల్యే రంగంలోకి దిగడంతో.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డాక్టర్‌ను వదిలిపెట్టారు. ఎటువంటి ఫిర్యాదు అందనందున డాక్టర్‌ను పంపించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనను టీడీపీ నేత నారా లోకేష్ ఖండించారు.
గిరిజన అధికారిపై జగన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యకాండ. గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పై జరిగిన సమీక్షా సమావేశంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కేసులు పెరుగుదలకు మమ్మల్ని నిందించడం ఏంటి అని ప్రశ్నించిన నాదెండ్ల వైద్యాధికారి సోమ్లూ నాయక్ గారిని చులకన చేసి మాట్లాడటమే కాకుండా... pic.twitter.com/CwFlO5bQTx
ఇక డీఎస్పీ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడిన డాక్టర్ సోమ్లా నాయక్.. ఆవేశంలో ఏమైనా మాట్లాడి ఉంటే క్షమించమని కలెక్టర్‌ను కోరానని అన్నారు. ఆయన కూడా పంపించండని అధికారులతో చెప్పారని వెల్లడించారు. దాంతో ఈ గొడవ అక్కడితో సద్దుమణిగింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.