GT Hemanth Kumar, Tirupathi, News18
సోషల్ మీడియా (Social Media) అంటే అందరికి ఆసక్తే. స్మార్ట్ ఫోన్ (Smart Phone) ఉన్న ప్రతి ఒక్కరికీ పేస్ బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter), ఇన్ స్టాగ్రామ్ (Instagram) వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఎకౌంట్స్ కచ్చితంగా ఉంటున్నాయి. ఈ రోజుల్లో తిండితిప్పలైనా మానేసేవాళ్లున్నారుగానీ.. సోషల్ మీడియాను చూడకుండా ఉండేవాళ్లు లేరు. ఇక బాగా చదువుకున్న వాళ్ళైతే ఆ యాప్స్ తోనే సహజీవనం వంటివి చేసేస్తున్నారు. చాటింగ్ తో స్టార్ట్ అయిన పరిచయాలు... డేటింగ్ వరకు వెళ్తున్నాయి. అలాంటి కాంటాక్ట్స్, రిలేషన్స్ చివరకు కొంపముంచుతున్నాయి. సోషల్ మీడియాను చూస్తున్నప్పుడు తరచూ యాడ్స్ వస్తుంటాయి. వాటిలో ప్రధానంగా మన ప్రొఫైల్ లో ఉన్న అభిరుచులు, సెర్చ్ హిస్టరీని బట్టి పలు యాడ్స్ వస్తంటాయి అలా ఓ వ్యక్తికి సోషల్ మీడియా ద్వారా ఓ డేటింగ్ యాప్ లింక్ వచ్చింది. క్లిక్ చేసి లాగిన్ చేశాడు. అక్కడితో ఆగలేదు. అంతేకాదు ఓ యువతి చెప్పిందల్లా చేశాడు. చివరికి కష్టాల్లో ఇరుక్కుపోయాడు.
నెల్లూరు కు చెందిన ఓ డాక్టర్.. సొంతగా హాస్పిటల్ నడుపుతున్నాడు. నిత్యం పేషెంట్లతో బిజీగా గడిపే సదరు డాక్టర్.. ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేసేవాడు. అదే సమయంలో ఎక్కువగా యువతుల కోసం సెర్చ్ చేస్తుండేవాడు. ఈ క్రమంలో పలు రకాల డేటింగ్ సైట్లకు సంబంధించిన యాప్స్ వచ్చేవి. ఓ రోజు వాటిలోని ఓ డేయింగ్ సైట్ క లాగిన్ అయ్యాడు. ఆ వెంటనే డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. యువతితో చాటింగ్ మొదలెట్టాడు. రెండు రోజులు విపరీతమైన చాటింగ్ వారిద్దరిమధ్య సాగింది. ఇంతలోనే ఇద్దరి మధ్య లైంగిక విషయాలపై చర్చ సాగింది.
ఇలా సాగిన చాటింగ్ కాస్తా వీడియో కాల్.. ఆ తర్వాత సెమీ న్యూడ్ వీడియో కాల్ వరకు వెళ్లింది. అక్కడితో ఆగకుండా న్యూడ్ వీడియో కాల్ వరకు వెళ్ళింది వ్యవహారం. అతడితో మత్తుగా మాట్లాడిన యువతి.. డాక్టర్ ను కూడా దుస్తులు విప్పని చెప్పింది. అమ్మాయి అడగటంతో మనోడు రెచ్చిపోయి చెప్పినట్లే చేశాడు. దీంతో సదరు వీడియోలన సదరు యువతి రికార్డ్ చేసింది. అలా పలుసార్లు న్యూడ్ కాల్ మాట్లాడిన తర్వాత ఆ యువతి నుంచి ఫేస్ బుక్ ద్వారా వీడియో మెసేజ్ వచ్చింది.
ఆ వీడియో చూసి షాక్ అయిన డాక్టర్ ఎందుకు రికార్డ్ చేశావని ప్రశ్నించగా.. తనకు వెంటనే రెండు లక్షలు ఇవ్వకుంటే వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం మొదలుపెట్టింది. ఇలా అతడి వద్ద నుంచి రూ.10 లక్షలక పైగా సొమ్మును కాజేసింది. అయినా దాహం తీరని ఆ యువతీ మళ్లీ డబ్బులు కావాలని బ్లాక్ మెయిల్ చేయడంతో చేసేదిలేక పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Dating App, Nellore Dist