హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ugadi 2023: ఉగాది పచ్చడి ఎందుకు తినాలి..? అసలు విషయం తెలిస్తే ఎగబడి తింటారు..

Ugadi 2023: ఉగాది పచ్చడి ఎందుకు తినాలి..? అసలు విషయం తెలిస్తే ఎగబడి తింటారు..

Ugadi 2023

Ugadi 2023

ఉగాది అనగానే ముందుగా గుర్తొచ్చేది షడ్రుచులతో కూడిన పచ్చడే.. తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు.. ఈ ఆరు రుచులతో తయారు చేసే పచ్చడి వెనుక సంప్రదాయంతోపాటు అంతకుమించి ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది. ఉగాది పచ్చడితో వచ్చే ప్రయోజనాలు తెలిస్తే.. ఎగబడి తింటారు..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

Ugadi 2023:  తెలుగు ప్రజలు ఎంతో ఇష్టంగా.. భక్తి భావంతో జరుపుకునే పండుగల్లో ఉగాది ఒకటి..  ఈ ఉగాది (Ugadi) రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. ఉగాది అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది.. పండుగ రోజున చేసే పచ్చడే.. అన్ని పండుగల సమయంలో పిండి వంటలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వాటన్నింటికంటే.. అత్యధికంగా ఉగాది పచ్చడికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.  తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు.. ఈ ఆరు రుచులతో తయారు చేసే పచ్చడి వెనుక సంప్రదాయంతోపాటు అంతకుమించి ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది. ఉగాది పచ్చడితో వచ్చే ప్రయోజనాలు తెలిస్తే.. ఎగబడి తింటారు.. వసంత రుతువులోకి ప్రవేశిస్తున్న తరుణంలో శారీరకంగా, మానసికంగా తలెత్తే మార్పుల్ని కట్టడి చేసి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడానికి ఈ షడ్రుచులు ఎంతగానో తోడ్పడతాయనేది నిపుణుల మాట.

 ఆరు రుచులు కలిసి ఆరోగ్యాన్ని కాపాడడమే కాదు.. మానవాళికి ఎన్నో సంకేతాలు కూడా ఇస్తుంది.  సుఖ దుఃఖ సమ్మిళితమైన మానవ జీవితానికి సంకేతంమని పెద్దలు చెబుతుంటారు.  మానవులు సుఖాలకు పొంగిపోకుండా, దుఖాలకు కృంగి పోకుండా రెండింటిని సమానంగా స్వీకరించాలనేది దీనిలోని పరమార్ధం అంటున్నారు పండితులు.

ఉగాదికి ఎంతో ప్రత్యేకత ఉంది. పండుగ రోజున బ్రహ్మముహూర్తానే  నిద్రలేచి నువ్వులనూనెతో తలంటుకుని ఉసిరిక పప్పు, పిండి లేదా పెసర పిండితో అభ్యంగపు స్నానం చేసి నూతన కాటన్‌ వస్త్రాలు ధరించాలి. తరువాత పరగడపునే వేపపూత పచ్చడితో చేసిన నింబకుసుమ భక్షణం తినాలి. దీంతో  సర్వారిష్ట నివారణలతో పాటు వజ్రము వంటి శరీరము, దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. మామిడి చిగురు, అశోక చెట్టు లేత చిగుళ్ళు, వేపపూవు, కొత్త బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి కాయముక్కలు, చెరుకు ముక్కలు, ఇంగువను పొంగించి దీనిలో బెల్లం, సైందవలవణం కొద్దిగా నూరి చింతపండు పటిక బెల్లం, వాము, జీలకర్ర తదితరాలను కలిపి మంచి పసుపుతో మెత్తగా నూరాలి. దీని అర తులము లేదా పావు తులము మోతాదులో పరగడుపున సేవిస్తేఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ఆరు రుచులు కలిగినది కావున అందరు సేవించి దీర్జాయుషుగలవారిగా జీవించాలని ఆయుర్వేద శాస్త్రము చెబుతుంది.

ఇదీ చదవండి : నారా దేవాన్ష్ బర్త్ డే.. టీటీడీకి ఎంత విరాళం ఇచ్చారంటే..?

సాధారణంగా వేసవి వచ్చే సమయం కావడంతో వాతావరణంలో సంభవించే మార్పులను శరీరం తట్టుకొనే విధంగా ఈ పచ్చడి  కాపడుతుందని డా॥ఆర్‌. శ్రీనివాస్‌, ప్రభుత్వ ఆయుర్వేదవైద్యాధికారి వెల్లడించారు.  ఉగాది వచ్చడి - షడ్రుచుల - సమ్మేళనము -మానవుడి ఆరోగ్యానికి ఉగాది పచ్చడి ఎంతగానో మేలు చేస్తుంది అన్నారు. పండుగనాడే కాకుండా ప్రతిరోజు తీసుకుంట చాలా రకాల వ్యాధుల నుండి రక్షించుకోవచ్చును. ప్రపంచములో ఏ ఆహార పానీయములో దొరకని షడ్రుచుల పానీయమే  ఉగాది పచ్చడిలో లభ్యమవుతుంది. ఉగాది వచ్చడి మనకు లభించడం అదృష్టంగా భావించాలి అంటున్నారు.

ఇదీ చదవండి : మహిళా ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త.. ఆ లీవులు ఎప్పుడైనా వాడుకొనే అవకాశం

ఆరు రుచులు వాటి ప్రాముఖ్యం ఏంటంటే..?                                                                                                  1. మధుర రసం: తీపి-బెల్లము, 2. ఆమ్ల రసం: - పులువు-చింతపండు 3.లవణ రసం:  లవణం - ఉప్పు,  4. కటు రసంః  కారము - ఓమ   5. తిక్త రసం:  చేదు-వేప పువ్వు   6. కషాయ రసం:  మామిడి పిందెలు.. ఈ ఆరింటిని  మన ఆయుర్వేదంలో షడ్రుచులుగా చెబుతారు. వీటి ప్రయోజనాలు ఏంటంటే..?

ఇదీ చదవండి : వైదిస్ కొలవెరీ..? పట్టబధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై అంతర్మథనం.. తప్పు ఎక్కడ జరిగింది?

షడ్రుచుల ఉపయోగం ఏంటంటే..?   

1.మధుర రసం: తీపి - బెల్లం: బెల్లం మనసును ఆహ్ల్హాదపరున్తుంది.  ఒక రోజుకు సరిపడే విటమిన్స్‌, మినరల్స్‌,  పొటాషియం లభిస్తాయి.  అలాగే   దగ్గు, అజీర్తి, అలర్జీ, మలబద్ధకాన్ని నివారిస్తుంది. శరీర బరువువు తగ్గిస్తుంది.  2. ఆమ్ల రసం: పులుపు-చింతపండు: చింతపండు జీర్ణశక్తిని సంపాందిస్తుంది. విరోచన కారిగా పనిచేస్తుంది. జీర్ణాశయంలోని వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. 3. లవణ రసం:  ఉప్పు: ఉప్పు రుచిని కల్పిస్తుంది. హైపోనెట్రిమియా రాకుండా నివారిస్తుంది. శరీరంలో ఎలక్రోలైట్స్‌ను బ్యాలెన్స్‌గా ఉంచుతుంది. 4. కటువు రసం:  కారం-ఓమ : వాము కారంగా ఉండి ఆకలిని కల్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది. రాకుండా కాపురుతంది. పీచు పదార్థం, మినరల్స్‌, విటమిన్స్‌ అధికంగా ఉంటాయి.  బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్‌ను నిపారిస్తుంది. ఆస్తమా, దగ్గు శ్వాస సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. విరేచనాలను, కట్టడి చేయడానికి, ఎముకుల, కీళ్ల నొప్పులు నివారిణిగా పనిచేస్తుంది. 5. తిక్త రసం: చేదు-వేప పువ్వు:  వేప కడుపులోని క్రిములను నాశనం చేస్తుంది. రక్త శుద్ధికి తోద్పడుతుంది. అనేక రకాల చర్మ వ్యాధులు రాకుండా కాపాడుకుంది. దీనిని పొడర్‌గా చేసి గాయాల పైన చల్లితే తొందరగా మానుతాయి..  6. కషాయ రసం:  ఒగరు (మామిడి పిందెలు) : ఇందులో పీచు వదార్ధము ఎక్కువగాఉండడంతో పాటు ఒగరు గుణం కూడా ఉంటుంది. శరీరంలో పేరుకు పోయిన మలినాన్ని బయటకు పంపించి మలబద్ధకం రాకుండా చేస్తుంది.  పెద్ధ ప్రేగు క్యాన్సర్‌ రాకుండా కాపుడుతుంది. విరేచణాలు, రక్త విరేచణాలను అరికడుతుంది.  సన్నగా (బక్కపలచని వారు) పాలల్లోగాని, బెల్లంతోగాని తీసుకుంటే లావు అవుతారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Guntur, Ugadi 2023

ఉత్తమ కథలు