ఆ ప్రాజెక్టుపై ముందుకెళ్లొద్దు.. జగన్ సర్కార్ దూకుడుకు కృష్ణా బోర్డు బ్రేక్

అపెక్స్ కౌన్సిల్ అనుమతులు వచ్చేవరకు ప్రాజెక్టుపై ముందుకు వెళ్లొద్దని ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖలో రాసింది.

news18-telugu
Updated: July 30, 2020, 12:43 PM IST
ఆ ప్రాజెక్టుపై ముందుకెళ్లొద్దు.. జగన్ సర్కార్ దూకుడుకు కృష్ణా బోర్డు బ్రేక్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకు వెళ్లొద్దన్న కృష్ణా రివర్ బోర్డు మేనేజ్‌మెంట్ ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతులు వచ్చేవరకు ప్రాజెక్టుపై ముందుకు వెళ్లొద్దని కృష్ణా బోర్డు లేఖలో స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోత పథకం టెండర్లు ఆపాలని ఆదేశించింది. రాయలసీమ ప్రాజెక్ట్ విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని కృష్ణా రివర్ బోర్డు లేఖలో పేర్కొంది. రాయలసీమ ప్రాజెక్టుపై కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో...బోర్డు ఏపీ ప్రభుత్వానికి ఈ మేరకు లేఖ రాసినట్టు తెలుస్తోంది.

మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న జల ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఆగస్టు 5న ఐదున వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ బుధవారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశాన్ని నిర్వహించాలని అపెక్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌, కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నిర్ణయించారని, 5న సీఎంలు అందుబాటులో ఉంటారా లేదా అన్నది సమాచారం ఇవ్వాలని కోరారు.

Krishna river board, ap government, rayalaseema lift irrigation scheme, ap news, telangana news, కృష్ణా రివర్ బోర్డు, ఏపీ ప్రభుత్వం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, తెలంగాణ న్యూస్, ఏపీ న్యూస్
జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్)


ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు సంబంధించి కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకం, డిండితో పాటు గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకు వెళ్లొద్దని కృష్ణా రివర్ బోర్డు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: July 30, 2020, 12:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading