APSRTC: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆఫర్ల వరాలు కనిపిస్తున్నాయి.. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అని తేడా లేకుండా.. దీపావళి బంపర్ ఆపర్లు (Diwali Offers) ప్రకటించేస్తున్నారు అందరూ. దీపావళి పండుగ (Diwali Festival) ముందు ఈ ప్రకటనల సంఖ్య భారీగానే ఉంటుంది. అయితే అర్టీసీ బస్సులు (RTC Buses) అంటే.. సురక్షితమైన ప్రయాణం అని ప్రచారం చేస్తుంటారు. ఏ రాష్ట్ర ఆర్టీసీ అయినా ఇదే ప్రచారం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆర్టీసీ కూడా కమర్షియల్ గా ఆలోచిస్తోంది. సాధారణంగా పండుగ వచ్చింది అంటే.. ఆఫర్లు వర్షం కనిపిస్తుంటుంది. చీరల నుంచి ఆభరణాలు వరకు.. కిరాణా సరుకు నుండి.. ఎలక్ట్రానిక్ గూడ్స్ వరకు.. అన్నింటిపైనా ఆఫర్లు కనిపిస్తుంటాయి. దీపావళి ఆఫర్ అంటూ.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ ఆఫర్ల సందడి ఆర్టీసీని కూడా తాకింది.
ఆర్టీసీలో ప్రయాణం చేయండి బహుమతులు పొందండి అంటూ ప్రచారం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపోలో పల్లె వెలుగు బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు ఈ బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. ఈమేరకు జిల్లాలో నాలుగు డిపోల నుండి అమలాపురం నుండి వెళ్లే ఆర్టీసీ బస్సులలో గిఫ్ట్స్ బాక్స్ ఏర్పాటు చేశారు.
అయితే బహుమతులు ఎలా ఇస్తారు అంటే..? ప్రయాణికులు బస్సు దిగే ముందు తమ టికెట్‌పై పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలు చేసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్స్ లో ఆ టికెట్ ను వేయాలని సూచిస్తున్నారు. అలా అందరూ ఆ బాక్సులో వేసే టికెట్ల నుంచి లక్కీ డిప్ తీస్తారు. ఆ లక్కీ డిప్ ద్వారా విజేతలను ఎంపిక చేస్తామని మేనేజర్ తెలిపారు.
ఇదీ చదవండి : ఎన్ని మందలు వచ్చినా.. సింహం సింగిలే.. ఇకపై విశాఖ నుంచే పరిపాలన క్లారిటీ ఇచ్చిన వైసీపీ
ఆర్టీసీ అమలు చేస్తోన్న ఈ అవకాశాలను ప్రయాణికులు వినియోగించుకోవాలని నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి ఒక్కరు తమ టికెట్ పై ఫోన్ నెంబర్ వేసి బాక్స్ లో వేసి వెళ్లాలని సూచిస్తున్నారు. అంతేకాదు ఎలా ఉపయోగించుకోవాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు స్వయంగా అమలాపురం డిపో మేనేజర్ బస్సు ఎక్కి ప్రయాణికులకు వివరించారు.
ఇదీ చదవండి: జనసేనకు భారీ ఊరట.. విశాఖ ఘటనలో అరెస్టైన నేతలకు బెయిల్.. న్యాయమే నెగ్గిందన్న పవన్
ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తెస్తోంది. ఇటీవల మచిలీపట్నం డిపో పరిధిలో కూడా ఇలాంటి గిఫ్ట్ స్కీంను ప్రవేశపెట్టారు. ప్రతి 15 రోజులకొకసారి.. లక్కీడిప్ ద్వారా ఇద్దరు విజేతలను ఎంపిక చేసి ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు డిపో మేనేజర్ పేర్కొన్నారు. కేవలం గిఫ్ట్ ఇవ్వడం మాత్రేమే కాదు.. ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం సాధ్యమని.. దానికి అదనంగా ప్రయాణికులకు కూడా అందిస్తున్నామని.. ఈ అవకాశాన్ని ప్రయాణికులు అంతా ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Apsrtc, RTC buses