మార్కెట్లలో దీపావళి వస్తువుల కళకళ... చైనాకు షాక్

Diwali 2019 : రాన్రానూ మనవాళ్లకు స్థానికంగా తయారయ్యే వస్తువులపైనే ఆసక్తి పెరుగుతోంది. చైనా ఉత్పత్తులకు గుడ్ బై చెబుతున్నారు. వినాయకచవితి, దసరా తర్వాత... దీపావళికీ చైనాకు షాక్ తగులుతోంది.

news18-telugu
Updated: October 25, 2019, 6:30 AM IST
మార్కెట్లలో దీపావళి వస్తువుల కళకళ... చైనాకు షాక్
మార్కెట్లలో దీపావళి వస్తువుల కళకళ... చైనాకు షాక్
  • Share this:
Diwali 2019 : ఈ ఏడాది దీపావళికి సందడి మొదలైంది. మార్కెట్లలో బాణసంచా ఔట్‌లెట్లు, బొమ్మల కొలువు వస్తువులు, ప్రమిదలు, దీపాలు ఇలా పండుగకు కావాల్సిన సమస్తం లభిస్తున్నాయి. స్వీట్ల షాపులు కూడా కళకళలాడుతున్నాయి. దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవడానికీ... పండుగ నాడు... బొమ్మల కొలువు కోసం బొమ్మలు, అలంకరణ కోసం ప్రమిదలను మహిళలు పెద్ద ఎత్తున కొంటున్నారు. ఈ షాపుల్లో అందంగా తయారుచేసిన వివిధ ఆకృతులలో కనిపిస్తున్న ప్రమిదలు, ప్రతిమలు ఆకట్టుకుంటున్నాయి. ఏనుగులు, కమలం, గుర్రాలు, నెమలి, ఒంటెలు, పూల తోరణాలు, ధ్వజస్తంభాలు, స్వస్తిక, దేవతల ప్రతిమలు చూడచక్కగా ఉన్నాయి. మహిళల కోసం ఎక్కడికక్కడ ప్రత్యేక షాపులు వెలిశాయి.

బాణసంచా ఔట్‌లెట్లకు పర్మిషన్లు లభించడంతో... అవి కూడా ప్రత్యేక ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. ఐతే... ఈ సంవత్సరం ఎక్కువ మంది దేశీయంగా తయారయ్యే టపాసులనే కొంటున్నారు. ముఖ్యంగా తమిళనాడులోని శివకాశి నుంచీ పెద్ద సంఖ్యలో బాణసంచా రకాలు తెలుగు రాష్ట్రాలకు వచ్చాయి. ప్రతీ సంవత్సరం సరిగ్గా దీపావళి రాగానే... చైనా నుంచీ పెద్ద సంఖ్యలో బాణసంచా ఉత్పత్తులు మార్కెట్లను ముంచెత్తేవి. ఈసారి మాత్రం ప్రజలు చైనా వస్తువుల్ని కొనేందుకు ఆసక్తి చూపించకపోవడంతో... వ్యాపారులు కూడా చైనా బాణసంచా కోసం ఆర్డర్లు పంపట్లేదు.

బొమ్మల కొలువు విషయంలోనూ విదేశీ విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమల్ని కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపించట్లేదు. దేశీయంగా మట్టితో తయారయ్యేవే ఎక్కువగా కొంటున్నారు. ఏటా లక్ష్మీదేవి, దుర్గాదేవి, వినాయకుడు, సరస్వతి దేవి, శివుడి ప్రతిమలు చైనా నుంచీ పెద్ద మొత్తంలో వచ్చేవి. ఐదారేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. స్థానికంగా తయారయ్యేవే ప్రజలకు నచ్చుతున్నాయి. అందువల్ల చైనా మార్కెట్ అడ్డంగా పడిపోయింది. ఇదివరకు ఈ విగ్రహాల్ని చైనా మాత్రమే అందంగా తయారుచెయ్యగలిగేది. ఇప్పుడా టెక్నాలజీ ఇండియాలోనూ అందుబాటులోకి వచ్చేయడంతో... మన దేశంలోనే వాటిని అద్భుతంగా తయారుచేస్తున్నారు. దాంతో చైనాకు చెక్ పెట్టినట్లైంది. ప్రస్తుతం దీపావళికి చైనా ఉత్పత్తులు 10 శాతం కూడా లేవు.


Pics : క్యూట్ సింగర్ షిర్లీ సెషియా అందాలు
ఇవి కూడా చదవండి :

ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ భయపడ్డారా... వ్యూహాత్మకంగా వ్యవహరించారా?Health Tips : పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

Diwali 2019 : దీపావళికి ఈజీగా రంగోలీ వెయ్యడం ఎలా?


Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి

Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.
Published by: Krishna Kumar N
First published: October 25, 2019, 6:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading