DIVYAVANI AUDIO CALL LEAKED SENSATIONAL COMMENTS ON TDP LEADERS SB
Divyavani: టీడీపీలో మహిళలు పర్సనల్ పనులు చేస్తేనే.. దివ్య వాణి ఆడియో కాల్ లీక్..!
Photo Twitter
ఓ మహిళ నేతతో దాదాపు పది నిమిషాల పాటు మాట్లాడిన కాల్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ కాల్లో వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. పర్సనల్ పనులు చేస్తేనే పదవులు అంటూ.. మహిళ నేతల గురించి మాట్లాడుకున్నారు.
ఎన్నికలకు ముందే ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరోవైపు టీడీపీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇటీవలే ఆ పార్టీ నుంచి ప్రముఖ సీనియర్ నటి, టీడీపీ మాజీ అధికార ప్రతినిధి దివ్య వాణి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీని వీడిన దివ్యవాణి ఆ పార్టీ లొసుగుల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. సొంత పార్టీలో పనిచేస్తున్న ఒక మహిళను అగౌరవ పరచడానికి టీడీపీ వాళ్లు ఎంత నీఛానికైనా పాల్పడతారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే తాజాగా దివ్యవాణి మాట్లాడిన ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ ఒకటి బయటకు వచ్చింది. అయితే ఆ కాల్లో దివ్యవాణితో పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు మాట్లాడింది. దివ్యవాణిని ఎందుకు పార్టీ వీడి వెళ్లిపోతున్నారంటూ ప్రశ్నలు వేసింది.
ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ ఆమె అడగడంతో.. పెద్దాయనతో (చంద్రబాబు) మాట్లాడి ప్రెస్ మీట్ పెడతారంటున్నారు. గవర్నమెంట్ వచ్చేలా ఉంది ఎందుకు తొందరబడి రిజైన్ చేస్తున్నారంటూ అవతల మహిళ ఫోన్లో అంటుంటే.. గవర్న్మెంట్ల గురించి చూసే వ్యక్తిత్వం తనది కాదన్నారు దివ్యవాణి. ఇన్నాళ్లు కష్టపడినా కూడా మర్యాద లేని చోట పదవులు ఎందుకు అంటూ దివ్యావాణి అన్నారు. దీనికి అవతల వ్యక్తి ఇందులో కొత్త విషయం ఏముంది... పార్టీలో ఎప్పుడూ ఉండేదేగా అన్నారు. దానికి దివ్యవాణి బదులిస్తూ నా స్వాభిమానం అది కాదన్నారు. మీరు మనం అనడానికి కూడా లేదు. మీరు పార్టీలో ఎప్పట్నుంచే ఉన్నారు. నేను సెలబ్రిటీని నిన్నకాక మొన్నవచ్చాను. కుక్కల్లా అందరి చుట్టూ తిరగాలంటే నేను అలా చేయలేను. నా వ్యక్తిత్వ అది కాదన్నారు దివ్యవాణి.
ఓ లిమిట్ వరకు చేస్తున్నాం. కానీ ఎక్కడికక్కడ ఇన్నర్ పాలిటిక్స్ చేస్తుంటే ఎలా అన్నారు. నన్ను ఎవరు టార్గెట్ చేశారో ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అంటూ దివ్యవాణి అన్నారు. పెద్దాయనతో (చంద్రబాబు) మాట్లాడక ప్రెస్ మీట్ పెట్టి నిర్ణయం తీసుకుంటానంటూ ఆ ఫోన్లో చెప్పారు. రాజకీయాల కోసం బతకడం లేదన్నారు. మేం పబ్లిక్ ఫిగర్లం.. హోలీ స్పిరిట్ గాడ్‌ను నమ్ముకొని వచ్చినవాళ్లం.నేను వందమందికి సమాధానం చెప్పాలి. నాకోసం వెయిట్ చేసేవాళ్లు కూడా ఉంటారు అన్నారు దివ్యవాణి.
పార్టీలో ఏం ప్రాముఖ్యత ఇచ్చారని సీరియస్ అయ్యారు. మహానాడులో పెద్దోళ్ల మాట్లాడింది... నేనేంటి అంటూ సీరియస్ అయ్యారు. నేను పదవులు, డబ్బులు పిచ్చిదాన్ని కాదన్నారు. ఆమెకు మరో పదవి ఇస్తే బావుండేదన్న విషయంలో ఎవరికి వారు మాకు తెలిదని మాట్లాడుతున్నారంటూ దివ్యవాణితో మట్లాడుతున్న మహిళనేత అన్నారు. దానికి దివ్యవాణి పవర్ లేకుంటే మాకెవరో తెలియదన్నారు. అశోక్ బాబు గురించి ఇద్దరు చర్చించుకున్నారు. అచ్చెన్నాయుడుతో మాట్లాడితే....నా సీటు ఇస్తే తీసుకుంటావా అన్నారు అని ఆ మహిళా నేత దివ్యవాణితో అన్నారు. అశోక్ బాబు, అచ్చెన్నాయుడు,జనార్థన్ ప్రస్తుతం రాజకీయం అంతా వీళ్ల చుట్టే ఉందన్నారు. వారి చెప్పినట్లే మనం చేయాలన్నారు. లేకుంటే పదవులు ఎవరికి ఇవ్వరన్నారు.
అంగన్వాడీ అధ్యక్షురాలి పదవి దివ్యవాణికి ఇవ్వాలన్నారు మహిళా నేత. అయితే ఆమె పర్సనల్ పనులు చేయదు కదా అన్నారన్నారు. అంగన్వాడీ అధ్యక్షురాలు అనే పదవి పోస్టు ఇస్తే బ్యాడ్‌గా బీహేవ్ చేయాలా? అని దివ్యవాణి ప్రశ్నించారు. పర్సనల్ పనులు చేసిన వాళ్లకే పదవులు... కష్టపడ్డవాళ్లకు విలువ లేదున్నారు. దీనికి సమాధానం ఇస్తూ., పెద్దాయన (చంద్రబాబు), చిన్నాయన (లోకేష్) దగ్గర ఇవన్నీ ఎందుకు చెప్పారంటూ ఆమెను దివ్యవాణి ప్రశ్నించారు. మాకు బాబుగారు అపాయింట్మెంట్ ఎవరు ఇస్తారని అవతలి మహిళా లీడర్ సమాధానం ఇచ్చింది.
నాకు మంచి పోస్టు అనేది ఇవ్వరు అన్నారు దివ్యవాణి. టీడీ జనార్థన్ రెడ్డి వంటి వాళ్లు ఉన్నన్నిరోజులు తనకు ఎలాంటి పదవులు రావన్నారు. నేనంతా టెన్షన్ పడనన్నారు. మూడున్నరేళ్లు కష్టపడి.. ఎవరు తనకు ఇన్ఫాం ఇవ్వకపోయిన పిల్లల్ని వదిలి అమరావతి ఉద్యమాల్లో పాల్గొన్నాను. నాపై ఎన్ని కామెంట్స్ పెట్టిన హార్డ్ వర్క్ చేశానన్నారు. మనకంటూ గౌరవం లేని చోట పనిచేయడం సరికాదన్నారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.