ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా

Housing Lands for Poor: జులై 8న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే అప్పటికీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15కు వాయిదా వేశారు.

news18-telugu
Updated: August 12, 2020, 1:19 PM IST
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మళ్లీ వాయిదా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడనుందా ? ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించిన ఏపీ ప్రభుత్వం... త్వరలోనే మళ్లీ ఇందుకోసం కొత్త తేదీని ప్రకటించబోతోందా ? ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే అనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడిన మంత్రి ధర్మాన కృష్ణదాస్.. ఇళ్ల పట్టాల పంపిణీ కచ్చితంగా ఉంటుందని అన్నారు. అయితే ఆగస్టు 15న కాకుండా మరో రోజున ఉండొచ్చని సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Housing lands for poor, housing lands distribution in andhra Pradesh, ap government, cm ys jagan news, ap news, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ, సీఎం వైఎస్ జగన్ న్యూస్, ఏపీ న్యూస్
ధర్మాన కృష్ణదాస్(ఫైల్ ఫోటో)


నిజానికి జులై 8న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అయితే అప్పటికీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15కు వాయిదా వేశారు. ఆగస్టు 15న పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే.. టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని కొద్దిరోజుల క్రితం ఆరోపించారు.

Housing lands for poor, housing lands distribution in andhra Pradesh, ap government, cm ys jagan news, ap news, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ, సీఎం వైఎస్ జగన్ న్యూస్, ఏపీ న్యూస్
సీఎం జగన్


వారి వల్ల సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కోర్టు కేసులకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోతే భారత స్వాతంత్ర దినోత్సవం రోజున 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు. అయితే కారణాలు ఏమిటో తెలియదు కానీ.. ఏపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడినట్టు కనిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: August 12, 2020, 1:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading