ప్రకాశం జిల్లాలో 2 నెలల్లో 30 మంది రైతులు ఆత్మహత్య... నిన్న ఇద్దరు బలవన్మరణం...

అన్నం పెట్టే రైతన్నలు ఎందుకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు?... తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని వైఎస్ జగన్ సర్కార్ చెబుతుంటే... మరి రైతులు ఎందుకు ప్రాణాలు వదిలేస్తున్నారు?

Krishna Kumar N | news18-telugu
Updated: August 7, 2019, 10:28 AM IST
ప్రకాశం జిల్లాలో 2 నెలల్లో 30 మంది రైతులు ఆత్మహత్య... నిన్న ఇద్దరు బలవన్మరణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు... అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 5 ఏళ్ల నుంచి తీవ్ర కరవు, ధరల పతనంతో పండిన పంటలు అమ్ముకోలేక... అప్పుల వాళ్లకు మొహం చూపించలేక ఒక్క ప్రకాశం జిల్లాలోనే రెండు నెలల్లో 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కలవరం కలిగిస్తోంది. మంగళవారం దర్శి మండలం బొట్లపాలెంకి చెందిన గంగిరెడ్డి దుర్గా ప్రసాద్ రెడ్డి... పురుగుల మందు తాగి పొలంలోనే ప్రాణాలు వదిలాడు. వ్యవసాయంలో అన్నీ నష్టాలే రావడం, కుటుంబాన్ని పోషించలేక పోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఆవేదనతో సూసైడ్ లెటర్‌లో రాయడం అందరినీ కలచివేసింది. తాను చనిపోతే... ఏపీ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతులకు... వైఎస్ఆర్ భరోసా కింద రూ.7 లక్షలు ఇస్తుంది అనీ... ఆ డబ్బుతో తన పిల్లల బతుకులకు కొంతైనా భరోసా ఉంటుంది అని సూసైడ్ లెటర్‌లో దుర్గా రెడ్డి తెలపడం ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టించింది.

ఇదే ప్రకాశం జిల్లా... మద్దిరాల పాడుకు చెందిన రైతు ఖాజావాలీ కూడా మంగళవారమే పొలంలో ఉరి పోసుకుని చనిపోయాడు. 35 ఎకరాల్లో శనగ పండించి అప్పులపాలైన... ఖాజావాలి 15 లక్షలు నష్ట పోయాడు. అవి తీర్చే దారి కనిపించక పోవడంతో పొలంలోనే ప్రాణాలు వదిలాడు.

జులై 25న ఇదే మద్దిరాలపాడు మండలంలో MRO కార్యాలయంలోనే రైతు రత్తయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అంతలోనే ఇద్దరు రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం ప్రకాశం జిల్లాలోని దయనీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైఎస్ సర్కార్... రైతుల మరణాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు స్థానికులు.

(డి.ఎల్.నారాయణ, కరెస్పాండెంట్, న్యూస్18తెలుగు)
Published by: Krishna Kumar N
First published: August 7, 2019, 10:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading