పోలీసుల మధ్య వాటాల పంచాయతీ.. చివరకు..

ఒకరి అవినీతి బాగోతాన్ని మరొకరు బయటపెట్టుకునే క్రమంలో పోలీసు శాఖ పరువుతీసే ప్రయత్నం చేశారు.

news18-telugu
Updated: July 13, 2019, 5:24 PM IST
పోలీసుల మధ్య వాటాల పంచాయతీ.. చివరకు..
(ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 13, 2019, 5:24 PM IST
గుంటూరు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఓ అధికారి మరికొంత మంది సిబ్బంది మధ్య వాటాల పంపకంలో వచ్చిన స్పర్దలు అంతర్గత కుమ్ములాటలకు దారితీసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ స్టేషన్ లో పని చేస్తున్న ఓ సబ్ -ఇన్స్పెక్టర్ చేతివాటం దెబ్బకి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఐతే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..?? అన్న చందంగా సదరు ఎస్ఐ ని ఆదర్శంగా తీసుకొని కొంత మంది సిబ్బంది విచ్చల విడిగా చెలరేగిపోయారు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అనే చందంగా తన క్రింది స్థాయి సిబ్బంది లక్షల్లో వసూళ్ళకు పాల్పడడంతో ఖంగుతిన్న సదరు అధికారి, వాళ్ళ అక్రమ వసూళ్ళ పర్వాన్ని బయటపెట్టించారు. దీంతో కంగుతిన్న కింది స్థాయి సిబ్బంది... తానేమీ తక్కువ తినలేదంటూ ఎస్.ఐ అవినీతి భాగోతమంతా ఉన్నతాధికారుల వద్ద ఏకరువు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నలుగురు పౌరులను అన్యాయంగా చితక బాదిన కేసులో ఐదుగురు సిబ్బందిపై వేటు పడి వారం రోజులైనా కాలేదు. ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే పోలీసు శాఖ పరువు రోడ్డున పడుతుందని గ్రహించిన ఉన్నతాధికారులు ఆ ఇద్దరి మధ్య మరో అధికారి సమక్షంలో రాజీప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ విషయం ఇప్పుడు నరసరావుపేట పోలీసు వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎప్పుడు ఏ ఉపద్రవం వచ్చి తమ మెడకు చుట్టుకుంటుందో అని అవినీతి అధికారులు భయంతో వణికిపోతున్నారు.

(రఘు అన్నా, గుంటూరు జిల్లా కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: July 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...