హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అదీ దిశ చట్టం అంటే... దేశమంతా అమలు చేయాలని డిమాండ్

అదీ దిశ చట్టం అంటే... దేశమంతా అమలు చేయాలని డిమాండ్

అదీ దిశ చట్టం అంటే... దేశమంతా అమలు చేయాలని డిమాండ్

అదీ దిశ చట్టం అంటే... దేశమంతా అమలు చేయాలని డిమాండ్

Disha Act 2019 : దిశ చట్టంలో అంశాలు రేపిస్టులకు తగిన బుద్ధి చెప్పేలా ఉండటంతో... ఆ చట్టాన్ని దేశమంతా అమలు చెయ్యాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Disha Act 2019 : తెలంగాణలో దిశ హత్యాచార ఉదంతంతో... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఘమేఘాలపై అమల్లోకి తెచ్చిన దిశ చట్టం 2019పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఇలాంటి చట్టాన్ని దేశమంతా అమలు చెయ్యాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. దిశ చట్టాన్ని వెంటనే దేశమంతా అమల్లోకి తెవాలని ఢిల్లీ మహిళా కమిషన్ (DCW) అధ్యక్షురాలు స్వాతి మలివాల్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 12 రోజులుగా తాను నిరాహార దీక్ష చేస్తున్నా... కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దిశ చట్టం దేశమంతా అమల్లోకి వచ్చే వరకూ తాను నిరాహార దీక్షను విడిచే ప్రసక్తే లేదన్నారు స్వాతి మలివాల్.

తెలంగాణలో దిశ హత్యాచార ఘటనను ఖండిస్తూ... డిసెంబర్ 3న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు స్వాతి మలివాల్. నేరం జరిగిన ఆరు నెలల్లో రేపిస్టులకు ఉరిశిక్ష పడేలా చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు. ఐతే... దీనిపై కేంద్రం స్పందించలేదు. తాజాగా దిశ చట్టంలో రేపిస్టులకు 21 రోజుల్లో శిక్ష పడేలా రూల్ ఉండటంతో... ఆ చట్టాన్ని దేశమంతా అమలు చెయ్యాలని కోరుతున్నారు. మరోవైపు ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో... దీక్షను విరమించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నిర్భయ తల్లి కోరారు. అయినప్పటికీ స్వాతి మలివాల్ తన దీక్షను కొనసాగిస్తున్నారు.


Pics : అందాల నయాగరా... సురభి క్యూట్ ఫొటోస్


ఇవి కూడా చదవండి :


అల్లు శిరీష్‌కి బన్నీ కొడుకు బాక్సింగ్ పంచ్‌లు...

శ్రీముఖిని వేధిస్తున్న ఆ సమస్య... ఇప్పట్లో పరిష్కారం కానట్లే...

జబర్దస్త్‌లో మళ్లీ అదే ఫార్ములా... కలిసొస్తుందా?

Health : అవిసె గింజల డ్రింక్... తాగితే అద్భుత ప్రయోజనాలు మీ సొంతం

రైల్వే లోకో పైలెట్లకు ఫాగ్‌పాస్ యంత్రాలు... ఏంటి వాటి ప్రత్యేకత?

First published:

Tags: Disha Act 2019, Telugu news, Telugu varthalu

ఉత్తమ కథలు