Home /News /andhra-pradesh /

DISCUSSION OVER ELECTRICITY GENERATION AND SUPPLY IN ANDHRA PRADESH AHEAD OF SUMMER SEASON FULL DETAILS HERE PRN

AP Power Issue: వేసవిలో ఏపీ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా పరిస్థితేంటి..? అదే సీన్ రిపీట్ అవుతుందా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నిత్యం చర్చకు వచ్చే అంశం విద్యుత్ (Electricity). రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఉత్పత్తి, సరఫరా వంటి అంశాలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వేసవి ప్రారంభం కావడంతో విద్యుత్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారనుంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నిత్యం చర్చకు వచ్చే అంశం విద్యుత్ (Electricity). రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఉత్పత్తి, సరఫరా వంటి అంశాలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. వేసవి ప్రారంభం కావడంతో విద్యుత్ అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారనుంది. గత ఏడాది అక్టోబర్ లో రూ.350 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో వారం రోజుల పాటు సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఐతే ప్రభుత్వం సకాలంలో స్పందించడం, తరిగిన చర్యలు తీసుకోవడంతో ముప్పుతప్పింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు సూచనలు చర్చనీయాంశమయ్యాయి. ప్రజలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని లేకుంటే వేసవిలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. శీతాకాలంలో బొగ్గు కొరతో ఇబ్బందులు ఎదుర్కొంటే.. విద్యుత్ డిమాండ్ పీక్ స్టేజ్ లో ఉండే వేసవి పరిస్థితి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

    అక్టోబర్ లో విద్యుత్ కొరత వచ్చిన నాటికి.. గతంతో పోలిస్తే 20శాతం డిమాండ్ పెరిగింది. కోవిడ్ కు ముందు రోజుకు 160 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే.. అక్టోబర్ లో 195 మిలియన్ యూనిట్లు అవసరమైంది. విద్యుత్ డిమాండ్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు 9వేల మెగావాట్లకు పైగా అవసరం అవుతోంది. వేసవిలో ఈ డిమాండ్ మరింత పెరిగే అవకాశముంది.

    ఇది చదవండి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఖరారు.. నోటిఫికేషన్ జారీ.. పూర్తి వివరాలివే..!


    ఏపీ జెన్‌కో వ్యవస్థాపిత సామర్థ్యం 5,010 మెగావాట్లు అయినప్పటికీ బొగ్గు కొరత కారణంగా పూర్తిస్థాయిలో ఉత్పత్తి కావడం లేదు. ఏపీలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుండగా.. గతఏడాది సెప్టెంబర్ లో 24 వేల టన్నులు మాత్రమే సరఫరా అయింది. ఈ వేసవిలో ఇదే సమస్య కొనసాగితే విద్యుత్ కష్టాలు తప్పవు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఒక్కో యూనిట్ కు రూ.15 నుంచి రూ.20 ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

    ఇది చదవండి: అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం.. భారీగా నిధుల కేటాయింపు..


    పీక్ డిమాండ్ ఉన్న సమయంలో నిరంతరం సరఫరా చేయడం కోసం ఒక్కో యూనిట్ కు 15 నుంచి 20 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని గతంలో ప్రభుత్వం తెలిపింది. బొగ్గు కొరత కారణంగా తక్కువ స్థాయిలో విద్యుత్ అంతరాయాలతో సరఫరా చేయగలుగుతున్నామని స్పష్టం చేసింది. ఏపీలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 18,533 మెగావాట్లు అయినప్పటికీ సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావటం లేదని పేర్కొంది. ఇందులో 8,075 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఉన్నా బేస్ లోడుకు సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావటం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 908 గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి వస్తున్న విద్యుత్ కేవలం 100 మెగావాట్లు మాత్రమేనని ప్రకటించింది.

    ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యేను గెలిపించి తప్పుచేశా..! చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి..


    2022-23 ఆర్థిక సంవత్సరానికి 66,530 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించవచ్చని ఏపీఈఆర్సీ అంచనా వేస్తోంది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ సేవలకు దాదాపు 19 లక్షల కనెక్షన్లకు 9,819 మిలియన్ యూనట్లు అవ‌స‌రం. పారిశ్రామిక‌, గృహ వినియోగానికి 38,199 మిలియ‌న్ యూనిట్లు అవసరం అవుతుంది. ఈ రెండు విభాగాల్లో 1.52కోట్ల మంది వినియోగదారులున్నారు. మొత్తం ఏపీలోని 1.91 మంది విద్యుత్ వినియోగ‌దారుల్లో పారిశ్రామిక‌, గృహ వినియోగ‌దారుల వాట 80శాతం ఉంది.

    ఇది చదవండి: ఏపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు


    ఏపీలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఇలా..
    ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం 16 విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. థర్మల్ పవర్ విషయానికి వస్తే.. విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్ లో 1760 మెగావాట్లు, రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ లో 1650 మెగావాట్లు మొత్తం 3410 మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది. జలవిద్యుత్ కేంద్రాల విషయానికి వస్తే.. శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రంలో 770 మెగావాట్లు, దిగువ సీలేరులో 560 మెగావాట్లు, ఎగవ సీలేరులో 240 మెగావాట్లు, నాగార్జున సాగర్ కుడి కాలువలో 90, నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ లో 50మెగావాట్లు, డొంకరాయి కాలువ 25 మెగావాట్లు, పెన్నా అహోబిలం కెనాల్ లో 20 మెగావాట్లు, చెట్టిపేట మినీ పవర్ ప్రాజెక్ట్ లో 1 మెగావాట్, మూచ్ ఖండ్ పరవ్ ప్రాజెక్టులో 60 మెగావాట్లు (ఏపీ వాటా), తుంగభద్ర డ్యామ్ లో 28.8 మెగావాట్లు (ఏపీ వాటా), హంపీ పంప్ హౌస్ లో 28.8 (మెగావాట్లు) మొత్తం 1773.6 మెగావాట్ల జలవిద్యుత్ ఏపీకి అందుబాటులో ఉంది. పునరుత్పాదక విద్యుత్ విషయానికి వస్తే అనంతపురం జిల్లా తలారి చెరువు సోలార్ ప్లాంట్ లో 400 మెగావాట్లు, పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు సోలార్ పవర్ ప్లాంట్ లో 5.426 మెగావాట్లు మొత్తం 405.126 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇక కృష్ణపట్నంలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్న సంస్థల్లో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 7,189 మెగావాట్లుగా ఉంది. వీటితో పాటు ప్రైవేట్ పవర్ ప్లాంట్ల నుంచి విద్యుత్ ను కొనుగోలు చేస్తోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, ELectricity

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు