RGV Comments: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ముదిరిన టికెట్ల వ్యవహారం సద్దు మణుగుతుందా..? వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)- మంత్రి పేర్ని నాని (Minster Perni Nani) ల మధ్య భేటీతో సినిమా ఇండస్ట్రీ సమస్యలు తీరుతాయా..? అసలు మంత్రితో ఏఏ అంశాలను చర్చించారు..? వర్మ చెప్పిన అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారా..? వీటన్నటికీ సమాధానం చెప్పారు రాం గోపాల్ వర్మ.. సచివాలయంలో వీరిద్దరి మధ్యం సుమారు రెండున్నర గంటల పాటు సమావేశం జరిగింది. అయితే ఈ భేటీపై వంద శాంతం సంతోషంగా ఉన్నాను అన్నారు వర్మ. అయితే తాను టాలీవుడ్ (Tollywood) తరుపున ఈ సమావేశానికి రాలేదు అన్నారు.. ఒక ఫిల్మ్ మేకర్ గా.. తన అభిప్రాయాలు చెప్పడానికే వచ్చాను అన్నారు. అయితే మంత్రితో మాట్లాడిన తరువత కచ్చితంగా సినిమా టికెట్ల వ్యవహారంపై త్వరోలనే వివాదం ముగిసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. సినిమా థియేటర్ల మూసివేత అంశంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
కేవలం పరిశ్రమలో నెలకొన్న తాజా సమస్యలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. అయితే ప్రభుత్వం ముందు తాను ఎలాంటి డిమాండ్లు పెట్టలేదు అన్నారు. పరిశ్రమలో ఉన్న ప్రస్తుత సమస్యలపై తన అభిప్రాయాలు మాత్రమే చెప్పానని.. ఎవరి తరపున తాను మాట్లాడడానికి రాలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు. సినిమా పెద్దల తరుపున కానీ... లేదా తాను డిస్ట్రిబ్యూటర్ల తరఫునో.. నిర్మాతల తరఫునో మంత్రిని కలవలేదన్నారు. అలాగే ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ల సినిమా రిలీజ్ వాయిదా పడడానికి ఏపీలో టటికెట్ల వ్యవహారం కూడా ఒక కారణం కావొచ్చు అన్నారు. ముఖ్యంగా పుష్ప సినిమా కలెక్షన్లను చూసిన తరువాతే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అన్నారు.
ఇండస్ట్రీకి ఉన్న సమస్యలు ప్రభుత్వానికి అర్థమయ్యాయి అనుకుంటున్నా అన్నారు . ఏ సమస్య అయినా ఒక్కరోజుతోనే తీరుపోదు అన్నారు. అయితే దిశగా తర్వాత చర్యలు జరగాల్సి ఉంది అన్నారు. తన సూచనలను మంత్రి విన్నారని. ఈ సమావేశంపై తాను వందకు వంద శాతం సాటిస్ఫై అయ్యాను అన్నారు ఆర్జీవీ. అలాగే కేవలం పవన్ కళ్యాణ్, బాలయ్యలపై కోపంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని తాను అనుకోవడం లేదన్నారు వర్మ..
ఇదీ చదవండి : థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం.. 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన సీఎం జగన్..
మరోవైపు తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలు పైనా వర్మ స్పందిచారు.. సినిమా వాళ్లంతా బలిసి కొట్టుకుంటున్నారంటూ వివాదాస్పదన వ్యాఖ్యలు చేశారు ఆయన. అయితే వాటిపై సాఫ్ట్ గా స్పందించారు వర్మ.. అందరికీ నోరు.. స్వేచ్ఛ ఉంటాయని.. ఎవరికి అభిప్రాయం వారికి ఉంటుంది అన్నారు..
ఇదీ చదవండి : అక్కడ మహిళలకు నో ఎంట్రీ.. పొంగళ్లు పెట్టేదీ మగవారే.. ఎందుకో తెలుసా..?
అయితే ఈ భేటీపై సినిమా ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.. ఇప్పటికే వరకు సినిమా పెద్దలు కానీ.. పెద్ద నిర్మాతలు కానీ ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు.. వర్మ తనంతట తాను వెళ్లినా.. చర్చింది సినిమా టికెట్ల వ్యవహారంపైనే.. దీంతో ఎలాంటి నిర్ణయం వచ్చినా అది ఇండస్ట్రీ మొత్తంపై పడుతుంది. అయినా ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు ఎవరూ స్పందించడం లేదు. మరోవైపు రేపు ప్రభుత్వం వేసిన కమిటీ.. టికెట్ల ధరలపై తుది నిర్ణయం ప్రకటించనుంది..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap minister perni nani, Ram Gopal Varma, Tollywood