హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ram Gopal Varma: మంత్రి కొడాలి నానిని అభినందిస్తూ వర్మ ట్వీట్.. గుడివాడ మరో గోవా అంటూ పొగడ్తలు

Ram Gopal Varma: మంత్రి కొడాలి నానిని అభినందిస్తూ వర్మ ట్వీట్.. గుడివాడ మరో గోవా అంటూ పొగడ్తలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల వ్యవహారంలో మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వాన్ని.. ముఖ్యమంత్రులను టార్గెట్ చేస్తూ వచ్చారు రామ్ గోపాల్ వర్మ.. ముఖ్యంగా కోడాలని నానిని ఉద్దేశిస్తూ.. తనకు న్యాచురల్ స్టార్ నానీ తప్ప మరే నాని తెలీదు అంటూ సెటైర్ వేశారు. ఇప్పుడు తాజాగా మంత్రి కొడాలి నానికి తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.. ఇంతకీ ఎందుకో తెలుసా..?

ఇంకా చదవండి ...

Ram Gopal Varma:  సంక్రాంతి (Sankranti) సంబరాలు  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా ఘనంగా జరిగితే.. గుడివాడ (Gudivada) మాత్రం హైలెట్ గా నిలుస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది సంక్రాంతి సమయంలో కోడి పందాలు (Cock Fight )పై చర్చ నడుస్తూ ఉంటుంది.. కానీ ఈ సారి గుడివాడలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల వివాదాస్పదంగా మారింది. దానికి ప్రధాన కారణం.. గుడివాడలోని ఓ ఫంక్షన్ హాల్ లో  పేకాట శిబిరాలు, గుండాటతో పాటు ప్రత్యేకంగా క్యాసినో (Casino) నిర్వహించారు. దీని లో ఎంట్రీ కోసం 10 వేల రూపాయలు చెల్లిస్తేనే క్యాసినోలోకి అనుమతించారు నిర్వాహకులు. ఈ ఫంక్షన్ హాల్ ప్రాంతంలో ప్రత్యేకంగా బౌన్సర్లను కూడా నియమించారు. సంక్రాంతి పండుగ స‌మ‌యంలో కోళ్ల పందేల‌తో పాటు పేకాట‌, క్యాసినో వంటి పోటీలను అక్కడ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు గత కొద్ది రోజుల నుంచి వైర‌ల్ అవుతున్నాయి. అంతే కాకుండా గుడివాడ‌లో జ‌రుగుతున్న పేకాట‌. క్యాసినో మంత్రి కొడాలి నాని (Minster Kodali Nani) ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు.. మంత్రి కొడాలి నానికి తాను సంపూర్ణ మద్తతు ఇస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

గత కొన్ని రోజుల నుంచి మంత్రి కొడాలి నానిని వర్మ టార్గెట్ చేశారు.. సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై వర్మ ఏపీ ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. దానిపై స్పందించిన మంత్రి కొడాలి నాని.. హైదరాబాద్ లో పని పాట లేకుండా కూర్చునవాళ్లు చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అసవరం లేదన్నారు.. అప్పటి నుంచి వర్మ మంత్రి కొడాలిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అసలు కోడాలి నాని ఎవరో తనకు తెలీదని.. న్యాచురల్ స్టార్ నాని మాత్రమే తనకు తెలుసు అన్నారు.. మంత్రి పేర్ని నానితో సమావేశం తరువాత కోడాలి నానిపైనా ట్వీట్ల యుద్ధానికి బ్రేకులు వేశారు. తాజాగా మరోసారి ట్వీట్ల వర్షం కురిపించారు. గుడివాడ‌లో క్యాసినో పోటీలు పెట్ట‌డం పై మంత్రి కొడాలి నాని కి త‌న పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్రకటించారు. గుడివాడను మోడరేట్ చేయాలనుకున్న మీ సంకల్పం మంచిదని.. ఎవరు విమర్శలు చేసినా పట్టించుకోవద్దు అంటూ ట్వీట్ చేశారు..

అక్కడితోనే వర్మ ఆగలేదు. ఈ విషయంలో మంత్రిని నిందిస్తున్న అందరికీ తాను ఓ సూటి ప్రశ్న వేస్తున్నాను అన్నారు.. క్యాసినోలు ఉన్న గోవా, లాస్ వేగాస్ లను ఎవరైనా తప్పుగా చూస్తారా అంటూ వర్మ నిలదీశారు.

లండన్, లాస్ వేగాస్, పారిస్ లాంటి నగరాలతో సమానంగా గుడివాడనకు ముందుకు తీసుకెళ్తున్న మంత్రిని ఎవరైనా అభినందించాలి అంటూ మరో ట్వీట్ చేశారు వర్మ..

గుడివాడలో క్యాసినోలకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు అంతా.. ఆ జిల్లా పురోగతిని వెనక్కు లాగుతున్న.. చీకట్లోకి నెడుతున్న వారవుతారంటూ వర్మ సెటైర్లు వేశారు..

గుడివాడకు గోవా సంస్కృతిని తీసుకొచ్చినందుకు.. గుడివాడ ప్రజలు గోవాకు వెళ్తారని గుర్తించాలి అన్నారు.. కానీ గోవా ప్రజలు గుడివాడకు రారు కదా అన్ని ప్రశ్నించారు. అయినా గుడివాడను ఆధునీకరించే ప్రయత్నం చేసినందుకు మంత్రి కొడాలి నానిని అభినందించాలి అంటూ మరో ట్వీట్ చేశారు వర్మ.

మరి వర్మ సెటైర్లకు మంత్రి కొడాలి నాని ఎలాంటి కౌంటర్లు ఇస్తారో చూడాలి.. ప్రస్తుతం ఆయన గుడివాడలో లేరు.. కరోనా బారిన పడి హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు.. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఆయన త్వరలోనే తిరిగి వస్తానని కార్యకర్తలకు చెప్పారు. మరి వచ్చిన తరువాత వీటిపై ఘాటుగా స్పందిస్తారో..  లేక లైట్ తీసుకుంటారో చూడాలి..

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Kodali Nani, Ram Gopal Varma

ఉత్తమ కథలు