ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా షూటింగుల సందడి పెరిగింది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో పదుల కోద్దీ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. చిన్న సినిమాలతో పాటు భారీ చిత్రాల షూటింగులకు ఏపీ కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ముఖ్యంగా అరకు, మారేడుమిల్లి, పోలవరం ప్రాంతాల్లో స్టార్ హీరోల సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. టాలీవుడ్ సినిమాలే కాదు కోలీవుడ్ సినిమాలకు కూడా ఆంధ్రా షూటింగ్ స్పాట్ గా మారుతోంది. ఇప్పటికే మారేడుమిల్లిలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ షఊటింగ్ జరుగుతోంది. తాజాగా మరో ప్రతిష్టాత్మక చిత్రానికి గోదావరి తీరం వేదిక అయింది. ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, జయం రవి నటిస్తున్న చిత్రం పొన్నియిన్ సెల్వన్ సినిమా షూటింగ్ ఇక్కడే జరుగుతోంది.
మణిరత్నం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో షూటింగ్ జరుపుకుటోంది. నదీ తీరం బ్యాక్ డ్రాప్ లో ఓ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సాంగ్ లో త్రిషతో పాటు పలువురు నటులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే విక్రమ్, ఐశ్వర్యారాయ్ కూడా షూటింగ్ లో జాయిన్ అవనున్నట్లు తెలుస్తోంది. హంసను పోలిన పంటులో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు.
కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడనేది యూనిట్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ అయిన మద్రాస్ టాకీస్ తో పాటు లైకా ప్రొడక్షన్స్ సంయిక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు సగం టాకీ పార్ట్ పూర్తైనట్లు తెలుస్తోంది.
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తోన్న 'ఆచార్య' సినిమా షూటింగ్ కూడా గోదావరి తీరలోనే జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఆచార్య షూటింగ్ జరుపుకుంటోంది. చిత్రీకరణలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి రాజమండ్రి చేరుకున్నారు. మారేడుమిల్లి ఏజెన్సీతో పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనూ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాంచరణ్ మారేడుమిల్లి చేరుకొని షూటింగ్ లో పాల్గొంటుండగా.. ఆదివారం చిరంజీవి రాజమండ్రి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. చిరుకి అభిమానులు భారీ స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి గోకవరం వరకు చిరంజీవి ర్యాలీ సాగింది.
గోదావరి తీరంలో స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ జరుపుకుంటండంతో వారిని చూసేందుకు గిరిజనులు, స్థానికులు భారీగా షూటింగ్ స్పాట్ వద్దకు చేరుకుంటున్నారు. వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కూడా తలకుమించిన పనిగా మారుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aishwarya Rai, Andhra Pradesh, Andhra pradesh news, AP News, Godawari river, Maniratnam, Polavaram, Telugu Cinema News, Telugu news, Tollywood, Tollywood Movie News, Trisha, Vikram