Home /News /andhra-pradesh /

DIFFERENT THEFT IN ANDHRA PRADESH ON THEFT STOLEN HUGE SWEETS IN SWEETSTAL AT KURNOOL NGS

Sweet Theft: ఆంధ్రప్రదేశ్ లో తీపి దొంగ కలకలం.. భారీగా మిఠాయిలు చోరీ.. ఎక్కడో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Sweet Theft: సాధారణంగా దొంగలు అంటే.. పరుసులు కొట్టేసేవారు ఉంటారు.. చైన్ స్నాచర్లు ఉంటారు.. ఏటీఎంలను కొల్ల గొట్టేవారు, ఇంటికి కన్నాలు వేసే వారు.. దారి దోపిడీ చేసి దోచుకోవడం ఇలా.. రకరకాల దొంగలు ఉంటారు.. వారి మెయిన్ టార్గెట్ భారీగా నదగు దోచు కెళ్లడం.. లేదా బంగారు ఆభరాలు ఎత్తుకెళ్లడం.. లేదంటే విలువైన వస్తువులు దొంగలించడం.. కానీ ఈ దొంగ చాలా డిఫెరెంట్ స్వీట్లను దొంగలించాడు..

ఇంకా చదవండి ...
  Sweet Theft: ఇప్పటి వరకు మనం చాలా రకాల దొంగలు గురించి వింటూ ఉంటాం.. చూస్తూ ఉంటాం.. సాధారణంగా దొంగలు విలువైన వస్తువులు, లేద నగలు లేదా డబ్బును ఎత్తుకెళ్తూ ఉంటారు. దొంగల టార్గెట్ ఈ మూడు మాత్రమే ఉంటాయి. ఇప్పటి వరకు ఎక్కడ దొంగతనాలు జరిగినా వీటి చుట్టూ అవి ఉంటాయి. కొంతమంది ఇళ్లకు కన్నాలు వేస్తారు.. మరికొందరు బ్యాంకులు, ఏటీఎంలుల్లో చోరీలకు పాల్పడతారు. మరికొందరు బస్సులు, ట్రైన్లు.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో.. మరికొందరైతే ఒంటరిగా వెళ్లేవారిని బెదిరించి దొంగతనాలు చేస్తూ ఉంటారు.. ఇలా వివిధ రకాల దొంగల గురించి నిత్యం వింటూనే ఉంటాం.. అయితే ఈ దొంగ మాత్రం వారికి పూర్తి బిన్నం.. అతుడు ఓ తీపి దొంగ.. అవును మీరు ఉంటున్నది నిజమే.. ఓ దుకాణంలోకి దూరిన దొంగ అక్కడ మిఠాయిలను భారీగా దొంగలించి అందరికీ షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా నేతి మిఠాయిలకు పేరుగాంచిన కర్నూల్ పుల్లారెడ్డి స్వీట్స్ దుకాణంలో ఈ వింత చోరీ జరిగింది.

  కర్నూలు నగరంలో ఫేమస్ అయిన రాజ్‌విహార్‌ సెంటర్‌లో ఉన్న మిఠాయిల దుకాణంలో ఓ దొంగ పడ్డాడు.. ఏదైనా షాపులో దొంగ పడితే అతడి ఫోకస్ నగదుపై పడుతుంది.. లేదంటే విలువైన వస్తువు ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు.. లేవంటే అక్కడ నుంచి వెళ్లిపోతాడు.. కానీ ఈ దొంగ మాత్రం మిఠాయి షాపులోకి దూరిన తరువాత.. అక్కడ ఉన్న నగదుతో పాటు స్వీట్లను కూడా అపహరించుకెళ్లాడు. దొంగ దుకాణం షట్టర్స్‌ను పగలగొట్టి మరీ ఈ చోరీకి పాల్పడ్డాడు. అయితే స్వీట్ల దొంగతనం జరిగిందని తెలిసిన వెంటనే స్థానికులంతా షాక్ కు గురయ్యారు. స్వీట్ దొంగలు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు.

  ఇదీ చదవండి : నిజమైన ప్రకృతి ప్రేమ అంటే ఇది.. నరికేసిన చెట్లకు పెద్ద కర్మ.. ఎక్కడో తెలుసా..?

  ఈ చోరీ విషయం తెలుసుకున్న దుకాణం యజమానులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. షట్టర్ పగలగొట్టినా రాత్రి ఆ ప్రాంతం నిర్మాణుష్యంగా ఉండడంతో ఎవరికీ తెలియలేదు. ఉదయం అటుగా వచ్చిన వాకర్స్ షాపు యజమానికి సమాచారం ఇచ్చారు. వేంటనే షాప్ వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు యజమాని. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు షట్టర్ ఓపెన్ చేసి పరిశీలించారు. నగదుతోపాటు స్వీట్స్ కూడా దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. షాపులోని సీసీకెమెరాలతో పాటు చుట్టుపక్కన ఉన్న సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.

  ఇదీ చదవండి : సినిమా టికెట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గిందా..? కారణం అదేనా..?

  ప్రస్తుతం ఈ దొంగ విషయం తెలియడంతో షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాల గురించి విన్నాం కానీ.. ఇలాంటి స్వీట్ దొంగను ఎక్కడా చూడలేదు అంటున్నారు.. స్వీట్లు దొంగతనం చేయడం ఎట్టి సుగర్ వచ్చి పోతాడని కొందరు సెటైర్లు వేస్తున్నారు. అలాగే ఈ మధ్య టమాటా రేట్లు వందకు పైగా ఉండడంతో.. టామాటాలో దొంగలను కూడా చూశాం.. చాలా మార్కెట్లలో టమాటాలు భారీగా చోరికి గురయ్యేవి.. ఇలా దొంగలు సైతం ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుస్తున్నారు..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు