హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Different Culture: ఏజెన్సీలో వింత ఆచారం.. ఐదేళ్ల చిన్నారులకు ఓణీల ఫంక్షన్

Different Culture: ఏజెన్సీలో వింత ఆచారం.. ఐదేళ్ల చిన్నారులకు ఓణీల ఫంక్షన్

Rare Culture: కొన్ని ఆచారాలు వినడానికి వింతగా ఉంటాయి.. కానీ వాటిని ఆ వర్గాల వారు అనవాయితీగా పాటిస్తూ వస్తూ ఉంటారు. అలాంటి ఆచారమే ఒకటి విశాఖ ఏజెన్సీలో ప్రత్యకంగా నిలుస్తోంది. కేవలం ఐదేళ చిన్నారులకే అక్కడ ఓణీల ఫంక్షన్ చేస్తారు.. ఎందుకో తెలుసా..?

ఇంకా చదవండి ...

  P Anand Mohan, Visakhapatnam, News18.                Different Culture: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విశాఖ జిల్లా (Visakha District)లో ఏజెన్సీ ప్రాంతంలో చాలా వింత వింత ఆచారాలు ఉంటాయి. ముఖ్యంగా చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలో ఆదిమ జాతికి చెందిన  మాలి తెగకు చెందిన గిరిజనుల ఆచారం గురించి తెలిస్తే షాక్ అవుతున్నారు. అక్కడ సామూహిక ఓణీల ఫంక్షన్ లు చేశారు.. ఒకే సారి 27 మంది చిన్నారి బాలికలకు.. అది కూడా కేవలం  ఐదు సంవత్సరాలు  పసి చిన్నారులకు ఇలా వేడుక నిర్వహించారు. ఇలా ఎందుకు చేస్తున్నారనని అడిగితే.. భవిష్యత్తులో వివాహం (Marraige) కోసమే ఈ వేడుక నిర్వహిస్తున్నామంటున్నారు ఆ ఏజెన్సీ పెద్దలు.  ఈ ఆదిమ  జాతికి చెందిన మాలి తెగకు చెందిన  గిరిజనలు పూర్వీకుల ఆచారం ప్రకారం  ఐదు ఆరు సంవత్సరములు లోపు ప్రతి ఆడపిల్లకు ఈ వేడుక చేయాలని చెబుతున్నారు.

  తమ పిల్లల వివాహాలకు సంబంధించి తల్లిదండ్రులు తన వంతు బాధ్యతగా బంధుమిత్రులను పిలుచుకొని టెంట్లు వేసి భోజనం విందు ఏర్పాటు చేస్తారు. దీని కోసం  20 రాటలతో  పందిరి వేస్తారు.  ఒక్కొక్క రాటకి ఏడు కుండలు చొప్పున కడతారు.  మరికొన్ని రాటలకు 9 కుండలు కట్టి..  మధ్యలో ఉన్న రాటకు 11 కుండలు కట్టి పెద్దల సమక్షంలో పచ్చని  తోరణాలతో పందిరి వేసి నేరేడు కొమ్మ లు మామిడి కొమ్మలు కట్టి.. ఆడపిల్లలను  పెళ్లికూతురులా ముస్తాబు చేసి..  పందిరి కింద కూర్చోబెట్టి హోం జరిపిస్తారు.

  ఇదీ చదవండి : వైసీపీకి విజయమ్మ రాజీనామా చేస్తున్నారా..? అధినేత జగన్ మనసులో మాట అదేనా..?

  ఆరుతవాత  వేదమంత్రాలతో తలపై నుంచి నీళ్లు పోస్తారు  అలా చేయడం ద్వారా వారి పెద్దలు సాంప్రదాయ ప్రకారం ఆడపిల్లలకు ఘనంగా పెళ్లి జరిగినట్లు వీరు భావిస్తారు. ఆ తరువాత ఆడపిల్ల రజస్వల అయిన తరువాత.. ఒకవేళ ఆమె తనకు నచ్చిన అబ్బాయితో వెళ్ళిపోయినా పెళ్లి    దోషం పోయినట్లే అన్నది వారి నమ్మకం.  పేద గొప్ప అని తేడాలేకుండా ఈ వేడుకను నిర్వహిస్తున్నామంటున్నారు గ్రామ పెద్దలు.

  ఇదీ చదవండి : ఏపీలో రామ్ చరణ్ కి డిఫరెంట్‌గా శుభాకాంక్షలు చెప్పిన మెగా ఫ్యాన్స్.. 

  ఇలా సామూహికంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని.. ఓణీల ఫంక్షన్ గా చేస్తున్నారు.  తరువాత యుక్తవయసు వచ్చాక ధనవంతులు వారి స్థాయిని బట్టి అమ్మాయికి నచ్చిన  అబ్బాయితో చట్టబద్ధంగా గౌరవ పరంగా వివాహ జరుపుకుంటారు. అదే పేద  వారైతే  మామిడి కొమ్మలు నేరోడ కొమ్మలు   తోరణాలతో చిన్న వయసులో చేసిన బాల్య వివాహాన్ని యుక్త వయసు వచ్చాక అమ్మాయి కి ఇష్టమైన అబ్బాయి తో వెళ్లి పోయినా  పరవాలేదు అని సరిపెట్టుకుంటారు.

  ఇదీ చదవండి : బీజేపీకి జై కొట్టడానికి కారణం అదేనా..? వైసీపీని టార్గెట్ చేస్తున్నారా..? మోహన్ బాబు ప్రచారాని అన్ని ఓట్లు వచ్చాయా..?

  దీంతో ఆడపిల్ల బాధ్యత తీరిందని తల్లిదండ్రులు భావిస్తారు. వీరంతా ఒడిశా నుంచి  వచ్చి జీవనోపాధి కోసం ఆకుకూరలు కూరగాయలు పండిస్తూ విశాఖ ఏజెన్సీలో అక్కడ అక్కడ నివసిస్తున్నారు. తోరణాలతో చిన్న వయసులో చేసిన బాల్య వివాహాన్ని యుక్త వయసు వచ్చాక అమ్మాయికి ఇష్టమైన అబ్బాయితో వెళ్లిపోయినా  పరవాలేదు అని సరిపెట్టుకుంటారు.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Visakha, Vizag

  ఉత్తమ కథలు