Home /News /andhra-pradesh /

DIFFERENT CULTURE IN ANDHRA PRADESH SOME VILLAGERS DOING MARRIAGE FOR TWO TREES NGS

Tree Marriage: రెండు చెట్లకు ఘనంగా వివాహం.. ఆపై వేడుకగా విందు భోజనం.. ఎందుకో తెలుసా..?

రావి-వేప చెట్టుకు పెళ్లి

రావి-వేప చెట్టుకు పెళ్లి

Tree Marriage: గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు చూస్తే షాక్ అనిపిస్తుంది.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదే అని నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్తితి. తాజాగా ఓ గ్రామంలో వేప-రావి చెట్లకు ఘనంగా పెళ్లి జరిపించారు. అక్కడితోనే ఆగలేదు. వేడుకగా విందు భోజనం ఏర్పాటు చేశారు.. ఎందుకో తెలుసా..?

ఇంకా చదవండి ...
    Tree Marriage: సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా.. కొన్ని చోట్ల సంప్రదాయాలు, ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పూర్వికులు చెప్పిన కట్టుబాట్లను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు నేటితరం వారు కూడా.. అయితే కొన్ని సంప్రదాయలు చూడడానికి అయ్యో పాపం ఇంత కష్టమా అనిపిస్తుంటాయి. కొన్ని మాత్రం సరదగా వింతగా ఉంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రామీణ ప్రాంతాల్లోనూ, ఏజెన్సీలోనూ వింత వింత ఆచారాలు మనకు అప్పుడప్పుడూ దర్శనం ఇస్తూ ఉంటాయి. అయితే ఇలా చేసే ప్రతి దాని వెనుక ఏదో ఒక కారణం ఉందని చెబుతూ ఉంటారు. ఊరికి అరిష్టం జరుగుతుందనో.. లేక గ్రామంలో ఉన్న కష్టాలు తొలిగిపోవాలనో.. లేక పెళ్లిల్లు జరగడం లేదని.. కరువు కాటకాలు వెంటాడుతున్నాయని.. ఇలాంటి ఆచారాలు కొనసాగించడం కారణంతోనే తాము సంతోషంగా ఉంటున్నామని ఆయా గ్రామస్థులు చెబుతూ ఉంటారు. తాజాగా అలాంటి వింత ఆచారం ఒకటి వెలుగులోకి వచ్చింది. వేప చెట్టుకు.. రావి చెట్టుకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు ఊరి పెద్దలు.. అంతేకాదు వేడుకగా విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. అలా చేయడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది అంటున్నారు.

    ఏజెన్సీ ప్రాంతాలు.. మారుమూల గ్రామాల్లోనే కాదు.. ఇలాంటి సంఘటనలు బాగు డవలప్ అయిన దేశాల్లోనూ చూస్తూ ఉంటాం. మన తెలుగు రాష్ట్రాల్లో చెట్లకు చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొందరు ఏకం చెట్లకు పెళ్లి చేస్తున్నారు. గతేడాది కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడాలని తిరువణ్ణామలై జిల్లాలోని ఓ ఆలయంలో రావి, వేప చెట్లకు వివాహం చేశారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో చోటు చేసుకుంది.



    తిరుపతి రూరల్ సమీపంలోని చిగురువాడకు చెందిన ముత్యాలయ్య, పద్మావతి దంపతులు.. గత 11 ఏళ్ల నుంచి రావి, వేప చెట్టుకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అలాగే వేడుకగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆ దంపతులు.. కేవలం పూజలతోనే సరిపెట్టలేదు.. రావి, వేప చెట్లకు వివాహం చేస్తున్నామంటూ.. బంధుమిత్రలను ఇంటికి కార్డులు ఇచ్చి మరీ ఆహ్వానించారు.

    ఇదీ చదవండి: ఏపీ కేబినెట్ లో కొత్త మంత్రులు ఎవరంటే..? జిల్లాలవారీగా ఫైనల్ లిస్ట్ ఇదే..

    ఆ వేడుకల్లో భాగంగా రావి, వేప చెట్లకు పట్టువస్త్రాలు కంకణాలు కట్టి నూతన వధూవరుల్లా ముస్తాబు చేశారు. సాక్షాత్తు శివ పార్వతులకే పెళ్లి జరిపించామన్న ఆనందంతో వివాహా వేడుక జరిపారు. సాధారణంగా మనుషుల పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో ఆ తంతు అంతా అక్కడ నిర్విహించారు. అర్చకుడి వేదమంత్రాలు, అగ్ని సాక్షిగా హోమం నిర్వహించి వేప, రావి చెట్టుకు పెళ్లి జరిపించారు. వేప రావి చెట్టు కలిసి ఉన్న చోట పందిళ్లు వేసి మంగళవాయిద్యాల మద్య మూడుముళ్లు వేయించి వేడుకగా పెళ్లి జరిపించారు. అనంతరం రుచికరమైన వంటకాలతో వివాహ విందు ఏర్పాటు చేసారు. ఇలా చేయడం ద్వారా పెళ్లి కాని వారికి పెళ్లిల్లు అవుతాయన్నది ఆ గ్రామస్థుల నమ్మకం. ఎవరి ఇంట్లోనైనా పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయంటే ఇలా.. రావి-వేప చెట్లకు పెళ్లి జరిపిస్తూ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Chitoor, Tirupati

    తదుపరి వార్తలు