హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Marriage Viral: ఆంధ్రప్రదేశ్ లో వింత ఆచారం.. ఇలా పెళ్లి చేస్తే పంటలు బాగా పండుతాయంట..?

Marriage Viral: ఆంధ్రప్రదేశ్ లో వింత ఆచారం.. ఇలా పెళ్లి చేస్తే పంటలు బాగా పండుతాయంట..?

వర్షాల కోసం వింత పెళ్లి

వర్షాల కోసం వింత పెళ్లి

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల వింత ఆచారాలు ఉంటాయి. అక్కడి ప్రజలు సాధారణంగానే మూఢ నమ్మకాలను ఎక్కువగా విశ్వసిస్తారు. దేవుళ్లకు బలి ఇవ్వడం, రకరకాల పూజలు చేస్తుంటారు. అయితే ఇవి మాత్రమే కాదు వింత ఆచారాలు కూడా పాటిస్తుంటారు. అలా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయన్నది వారి నమ్మకం.

ఇంకా చదవండి ...

Donkey Marriage: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గ్రామీణ ప్రాంత ప్రజలు సాధారణంగానే మూఢ నమ్మకాలను ఎక్కువగా విశ్వసిస్తారు. దేవుళ్లకు బలి ఇవ్వడం, రకరకాల పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేసే వారు కొందరైతే.. మొక్కులు తీర్చుకుంటూ సందడి చేసే వారు కొందరు. తమకు తెలిసిన నమ్మకాల ప్రకారం కప్పదాట్లు, జంతువులకు పెళ్లి చేయడం వంటి పూజల గురించి మనం నిత్యం వింటూనే ఉంటాం.  తాజాగా కర్నూలు జిల్లా (Kurnool district) లోనూ ఓ వింత ఆచారం వెలుగు చూసింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ అక్కడి ప్రజలు గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు. ఈ ఘటన జిల్లాలోని పత్తికొండ మండలం.. హోసూరులో చోటు చేసుకుంది. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ హోసూరు గ్రామ ప్రజలు వాసుదేవ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అంటే భక్తి శ్రద్ధలతో గాడిదలకు ఘనంగా పెళ్లి చేశారు. తరువాత సంప్రదాయబద్దంగా ఆ గాడిదలను ఊరంతా ఊరేగింపు నిర్వహించారు అక్కడి రైతులు. హోసూరు ప్రాంతంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. తాగడానికి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని గ్రామస్తుల విశ్వాసం.http://


గాడిదల పెళ్లి అంటే ఎదో తూతూ మంత్రంగా చేయడం కాదు.. అచ్చం మనుషులకు ఎలాగైతే పెళ్లి తంతు నిర్వహిస్తారో.. గాడిదలకు కూడా అలాగే నిర్వహించారు. అయితే, గతంలో కూడా గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు విస్తారంగా కురిసాయని, అందుకే ఈ సంవత్సరం కూడా

గాడిదలకు పెళ్లిళ్లు చేస్తున్నామని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా వర్షాలు కురిసి, పంటలు బాగా పండుతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల విజయనగరం (Vizianagaram) ఏజెన్సీలో ఓ వింత ఆచారం వీడియోలు వైరల్ గా మారాయి. సాలూరు మండలం కూర్మరాజుపేట.. ఈ గ్రామమంలో రైతులు ఎక్కువగా ఉంటారు.. ఇక్కడ పంటలు పండాలంటే వర్షమే ఆధారం.. ప్రతిఏటా పొలాల్లో పంట వేసే ముందు ఈ గ్రామ దేవత జాకరమ్మ కు ప్రత్యేక పూజలు చేసి మొక్కలు మొక్కటం సంప్రదాయం.. అంతే కాకుండా ఈ గ్రామానికి ఒక వింత ఆచారం ఉంది.. ఈ గ్రామం నుండి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ పై వెలిసిన జాకరమ్మ అమ్మవారి వద్దకు ఊరంతా ఊరేగింపుతో వెళ్లి ప్రత్యేక

పూజలు చేస్తారు..

ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలనుకునే స్టూడెంట్స్‌కు శుభవార్త.. ఏయూలో అమెరికన్‌ కార్నర్‌ సందడి

ప్రతి ఇంట్లో వారి స్థోమతకు తగ్గట్టు అమ్మవారికి సారె, చీర, గాజులు, పసుపుకుంకుమ అందజేస్తారు.. అంతేకాకుండా ప్రతి ఇంటి నుండి కోడి, మేక, గొర్రెపోతు ఇలా ఎవరికి నచ్చిన జంతువులను వారు అమ్మవారికి బలిచ్చి తమ కోరికలు కోరుకుంటారు.. వర్షాలు బాగా కురిపించాలని, తమ పంటలు సమృద్ధిగా పండి సిరిసంపదలు ఇవ్వాలని కోరతారు.. అనంతరం ఆలయ పూజారి ఒక కుండీలో పాయసం వండి అమ్మవారికి నైవేద్యం గా పెడతారు.. ఆ పాయసాన్ని ప్రతి కుటుంబసభ్యులకు ఒక్కో చోట నేల మీదే ప్రసాదంగా ఇస్తారు.. ఆ నైవేద్యంను చేతితో కాకుండా నేరుగా నాలుకతో సేవించటమే వీరి ఆచారంలో ప్రత్యేకత..

ఇదీ చదవండి: జగన్ సార్కార్ కు మరో షాక్.. లక్ష జరిమానా..? ఎందుకో తెలుసా..?

అలా నైవేద్యం సేవించి అందరూ కలిసి ఆనందంగా ఇంటికి చేరుకుంటారు.. అలా ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే వర్షం దంచికొడుతుంది.. దింతో తమను అమ్మ అనుగ్రహించిందని, తమకు వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండుతాయని ఆనందంలో మునిగితేలి పొలాల్లో పనులు

ప్రారంభిస్తారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kurnool, Life Style, Marriage, Rainfall

ఉత్తమ కథలు