Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నెలకొంది. అన్ని ప్రధాన పార్టీలు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు పై వ్యూహాలు రచిస్తున్నాయి. అదే స్థాయిలో పార్టీల మధ్య మాటల యుద్ధం పేలుతోంది. తాజాగా మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎందుకంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గాడ్ ఫాదర్ సినిమా (Godfather Movie) సక్సెస్ మీట్ లో ప్రొడ్యుసర్ ఓ ఆసక్తికర అంశాన్ని తెరపైకి తెచ్చారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీ కోసం అని చెన్నైలో ఉన్న ఆస్తులను అమ్మాల్సి వచ్చింది అన్నారు. అలాగే ప్రజారాజ్యం (Prajarajyam) అనుభావల ఆవేశం నుంచి వచ్చిందే జనసేన అంటూ వివరణ ఇచ్చారు. ఇతర వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత ధనవంతుల్లో ఒకరు.. ఒకప్పటి టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ అయిన మెగాస్టార్ చిరంజీవే పార్టీ కోసం.. ఆస్తులు అమ్మేశారు..
అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు పార్టీ పరంగా ఖర్చులు పెరిగాయి.. ఎన్నికల మొత్తం ధనమయం అయ్యాయి. దీంతో ఇప్పుడు పార్టీని నడపడం అంత ఈజీ కాదు. అన్నయ్యే పార్టీ కోసం ఆస్తులు అమ్మేసుకుంటే..? తమ్ముడు ఏం చేస్తాడు.. అసలు పవన్ ఆస్తుల విలువెంత అనే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఏ హీరోకు సాధ్యం కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్క పవన్ కళ్యాణ్‌కు మాత్రమే సొంతం అనడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. ఇంత ఫ్యాన్ బ్యాస్ సంపాందించుకోవడానికి సీనియర్ ఎన్టీఆర్ , మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికి సైతం వంద సినిమాలు తీయాల్సి వచ్చింది. కానీ పవన్ మాత్రం సినిమాల్లో ఇంకా హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. అప్పటికే అటు ఎన్టీఆర్, ఇటు అన్న మెగాస్టార్‌ను ఫ్యాన్ ఫాలోయింగ్‌లో మించిపోయారు అన్నది బహిరంగ రహస్యమే.
ఇదీ చదవండి : ప్రయాణికులపై కారం చల్లి పరారయ్యే ప్రయత్నం చేసిన యువకుడు.. కారణం తెలిసి అంతా షాక్
ఇంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న పవన్ ఖర్చు పెట్టకపోయినా.. గెలిచేస్తారు అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఆ రేజంలో అభిమానులు అయితే ఉన్నారు.. కానీ అవి ఓట్ల రూపంలో ఉండే అభిమానం కాకపోవడమే ఇప్పుడు సమస్య అవుతోంది. అందుకే పవన్ కు పార్టీ నడపడం కత్తిమీద సామే.. అన్నిటికన్నా ముఖ్యంగా గత ఎన్నికల నుంచి చూస్తే.. ఇప్పుడు పార్టీలు పెట్టే ఖర్చు రెట్టింపు అయ్యింది. కోట్లు కుమ్మరిస్తే కానీ ఒక అభ్యర్థి గెలుపు కష్టమే.. అలాంటింది 175 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలి.. ఎన్నికల్లో ఢీ అనాలి అంటే.. కొన్ని వందల కోట్లు అవసరం.
ఇదీ చదవండి : దేనికీ గర్జనలు.. ప్రశ్నలతో హోరెత్తెంచిన పవన్.. మియాం మియాం అంటూ కౌంటర్
ఆ విషయం పవన్ కు కూడా తెలుసు.. అందుకే పార్టీని నడపం అంత ఈజీ కాదు అనే ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నది ఆయన సన్నిహితులు చెప్పే మాట.. అయితే కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి.. రాజకీయంగా సహాయపడుతుంది కానీ.. ఆర్థికంగా ఖర్చు పెట్టాల్సింది పవన్ మాత్రమే.. మరి పవన్ ఆస్తులు ఎంత.. అన్నయ్యే పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుంటే.. పవన్ కు ఉన్న ఆస్తులు ఎంత.. ఎంత అమ్ముకోవాల్సి ఉంటుంది..
ఇదీ చదవండి: ఏపీలో విద్యార్థులకు మరో శుభవార్త.. ఈ ఏడాది నుంచే అమలు చేయాలని నిర్ణయం
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బహిరంగ మార్కెట్ వాల్యూలో లెక్కలు కడితే.. ఆయన ఆదాయం దాదాపు 200 నుంచి 300 కోట్ల రపాయల మధ్య ఉంటుందని అంచనా.. దాదాపు రూ.100 కోట్ల విలువైన ప్రాపర్టీలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే అత్యంత ఖరీదైన కార్లు, మిగతా ఆస్తుల విలువ 100 కోట్లపైనే ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కొక్క సినిమాకు సుమారు 50 కోట్ల రేమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఆ మధ్య అత్యంత ఖరీదైన భూమిని కొన్నారని కూడా తెలుస్తోంది. ఇలా అంతా కలిపి సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఆయన ఆస్తులు ఉండొచ్చు.. మరి ఆ ఆస్తులతో పార్టీ నపడం సాధ్యేమేనా.. 1500 కోట్ల దాకా మెగాస్టర్ చిరంజీవి ఆస్తులు ఉంటాయి.. అయినా ఆయన పార్టీ కోసం చెన్నైలో ఆస్తులను అమ్మాల్సి వచ్చింది.. మరి పవన్ వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఫండ్ ఎలా సేకరిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Politics, God Father Movie, Megastar Chiranjeevi, Pawan kalyan