గోదావరిలో బోటు వెలికితీత... పూర్తిగా ధ్వంసమైన రాయల్ వశిష్ట

మరికొద్దిసేపట్లో బోటు ఒడ్డుకు రానుంది. బోటును ఇప్పటికే ధర్మాడి సత్యం టీం నీటిపైకి తీసుకొచ్చింది.

news18-telugu
Updated: October 22, 2019, 4:28 PM IST
గోదావరిలో బోటు వెలికితీత... పూర్తిగా ధ్వంసమైన రాయల్ వశిష్ట
గోదావరిలో బయటకు తీసిన బోటు
  • Share this:
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో రాయల్ వశిష్ట ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గోదావరి నదిలో బోటు వెలికితీశారు. రెండు రోజులుగా నది అడుగుభాగానికి వెళ్లిన సీ డ్రైవర్స్ ఎట్టకేలకు బోటును మంగళవారం బయటకు తీశారు. అయితే బోటు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో బోటు ఒడ్డుకు రానుంది. బోటును ఇప్పటికే ధర్మాడి సత్యం టీం నీటిపైకి తీసుకొచ్చింది.నీటి అడుగు భాగం నుంచి రోప్‌ల సాయంతో బయటకు తీశారు.

గతనెల 15న పాపికొండలు విహారయాత్రకు వెళ్తున్న లాంచీ .... తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద మునిగింది. ఈ ప్రమాదం జరిగి దాదాపుగా 37 రోజులు తర్వాత బోటును బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 77 మంది ఉన్నారు. వీరిలో 39 మంది మృతిచెందగా 12 మంది గల్లంతయ్యారు. 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. బోటును బయటకు తీయడంతో గల్లంతైన 12 మంది ఆచూకీ లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

కొన్ని మృతదేహాల ఆచూకీ కూడా లభ్యం కాలేదు. దీంతో బోటులోనే ఆ మృతదేహాలు చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. కొన్ని రోజులుగా బోటు వెలికితీత పనుల్ని కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం టీం చేపట్టింది. నిన్నట్నుంచి విశాఖ నుంచి సీ డ్రైవర్స్‌ను తీసుకొచ్చి బోటును బయటకు తీసేందుకు చర్యలు వేగవంతం చేసింది.

First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading