బయటకొచ్చిన బోటు.. ధర్మాడి సత్యం టీమ్ ఆపరేషన్ ఎలా సాగిందంటే..?

సెప్టెంబరు 15న తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో పర్యాటకుల బోటు రాయల్ వశిష్ట మునిగిపోయింది. ప్రమాదం జరిగిన 15 రోజుల తర్వాత సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. సెప్టెంబరు 30న రాయల్ వశిష్ట కోసం ధర్మాడి సత్యం రంగంలోకి దిగింది.

news18-telugu
Updated: October 22, 2019, 5:10 PM IST
బయటకొచ్చిన బోటు.. ధర్మాడి సత్యం టీమ్ ఆపరేషన్ ఎలా సాగిందంటే..?
బయటకొచ్చిన రాయల్ వశిష్ట బోటు
  • Share this:
కచ్చులూరు వద్ద గోదావరి నదిలో రాయల్ వశిష్ట బోటు బయటపడింది. ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత బోటు నదిపైకి చేరింది. కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా ప్రయత్నించి ఎట్టకేలకు సక్సెస్ అయింది. నది గర్భం నుంచి మంగళవారం మధ్యాహ్నం బోటును వెలికితీసింది. విశాఖకు చెందిన డైవర్లు నది లోపలికి వెళ్లి బోటుకు తాళ్లు కట్టారు. అలా మూడు రోజుల పాటు శ్రమించి ఎట్టకేలకు పైకి తీసుకొచ్చారు. బోటులో 5 మృతదేహాలు బయటపడినట్లు తెలుస్తోంది. అసలు ఈ ఆపరేషన్ రాయల్ విశిష్ట ఎలా సాగిదంటే..?

సెప్టెంబరు 15న తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో పర్యాటకుల బోటు రాయల్ వశిష్ట మునిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ఆ తర్వాత మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలించారు. ఇక ప్రమాదం జరిగిన 15 రోజుల తర్వాత బోటు కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. సెప్టెంబరు 30న రాయల్ వశిష్ట కోసం ధర్మాడి సత్యం రంగంలోకి దిగింది. ఈ ఆపరేషన్ రెండు విడతల్లో ఆ ఆపరేషన్ జరిగింది. వర్షాలు, వరదల కారణంగా తొలి ఆపరేషన్‌కు ఆటంకాలు కలిగాయి. ఎలాంటి ఫలితం లేకుండానే మొదటి ఆపరేషన్ ముగిసింది.

ఇక ఇటీీవల ఎగువన వర్షాలు తగ్గడంతో గోదావరి నది ప్రవాహ ఉద్ధృతి కూడా తగ్గుముఖం పట్టింది. దాంతో ఈ నెల 16న మరోసారి ప్రయత్నాలను ప్రారంభించింది ధర్మాడి సత్యం బృందం. పెద్ద లంగర్లు, తాళ్లు వేసి బోటును పైకి తీసేందుకు ప్రయత్నించారు. బోటులో బోటులో ఇసుక, మట్టి పెద్దమొత్తంలో పేరుకుపోవడంతో బోటు ఒకేసారి బయటకు రాలేకపోయింది. ఇక ఓం శివశక్తి అండర్‌వాటర్ సర్వీసెస్‌(విశాఖపట్నం)కు చెందిన ఇద్దరు డైవర్లు ఆదివారం ఉదయం నదిలో మునిగి బోటుకు భారీ తాళ్లు కట్టి పైగి లాగారు. ఐతే మొదట రెయిలింగ్, ఆ తర్వాత పైకప్పుడు మాత్రం బయటపడ్డాయి. సోమవారం మరోసారి నీటి అడుగుభాగానికి వెళ్లి తాళ్లు కట్టి బోను పైకి తీసుకొచ్చారు.First published: October 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు