AP Panchayat Elections: శభాష్ పోలీస్... ఎన్నికల్లో మీరే హీరోలు... డీజీపీ అభినందన

ఓటర్లతో వీడియో కాల్ లో మాట్లాడిన డీజీపీ గౌతమ్ సవాంగ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) సందర్భంగా పోలీసులు అత్యుత్తమ సేవలు కనబరుస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ (DGP Gowtham Sawang) అన్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు అత్యుత్తమ సేవలు కనబరుస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కల్పించడంతో పాటు ప్రజలకు ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన డీజీపీ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ పనితీరు కనబరిచడమే కాకుండా ఎన్నికల సమయంలో సామజిక దృక్పథంతో వృద్ధులు, వికలాంగులుకు ఓటు వేసేందుకు చేయూత అందించిన పోలీస్ అధికారులు. సిబ్బంది, గ్రామ మహిళా కార్యదర్శిలను అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ తెలిపారు.

    అనంతరం ఓటు వేసే సమయంలో పోలీసుల సాయం పొందిన వృద్ధులతో వీడియో కాన్ ద్వారా మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం, బొద్దాం గ్రామానికి చెందిన అరసవెల్లి ఆదెమ్మెతో డీజీపీ ముచ్చటించారు. ఎన్నికల రోజు పోలీసులే తనను ఎత్తుకెళ్లి ఓటు వేయించారని... నడవలేని స్థితిలో ఉన్న తనకు ఎంతో సాయం చేసారని ఆదెమ్మ డీజీపీతో చెప్పారు. ఈ సందర్భంగా ఆదెమ్మ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు.

    DGP Gowtham Sawang , Andhra Pradesh Panchayat Elections, AP Panchayat Elections, Andhra Pradesh, Panchayat Elections, AP news, Telugu news, Gowtham sawang,  Srikakulam District, AP Police, AP elections news, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు, ఏపీ పంచాయతి ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, పంచాయతీ ఎన్నికలు, ఏపీ న్యూస్, తెలుగు న్యూస్, గౌతమ్ సవాంగ్, ఏపీ పోలీస్, ఏపీ ఎలక్షన్స్ న్యూస్, శ్రీకాకుళం జిల్లా
    ఆదెమ్మతో వీడియో కాల్ మాట్లాడుతున్న డీజీపీ సవాంగ్


    ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న నాలుగోదశ ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఓటర్లకు సేవలందించాలని డీజీపీ సూచించారు. ఇప్పటివరకు ముగిసిన మూడు దశల ఎన్నికల్లో పోలీసులు మెరుగైన సేవలందించారు. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యాలతో బాధవడుతూ నడవలేని స్థితిలో ఉన్నవారిని పోలీసులు చేతులపై మోసుకెళ్లి ఓట్లు వేయించారు.
    Published by:Purna Chandra
    First published: