Home /News /andhra-pradesh /

ఏపీకి రావాలంటే అనుమతి ఉండాల్సిందే.. తేల్చిచెప్పిన డీజీపీ

ఏపీకి రావాలంటే అనుమతి ఉండాల్సిందే.. తేల్చిచెప్పిన డీజీపీ

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(ఫైల్ ఫోటో)

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(ఫైల్ ఫోటో)

ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

    హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే వార్తల నేపథ్యంలో.. ఏపీకి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున మళ్లీ సొంత రాష్ట్రాలకు క్యూ కట్టారు. దీంతో హైదరాబాద్, విజయవాడ హైవేపై ఉన్న టోల్ ప్లాజాలతో పాటు ఏపీ సరిహద్దుల్లోని చెక్ పోస్టు దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతోంది. అయితే తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న వారంతా నిబంధనలు పాటించాల్సిందే అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పరోక్షంగా వెల్లడించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయని వివరించారు.

    ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని తెలిపారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని అన్నారు. అనుమతి తీసుకున్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్‌ చెక్‌పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతిస్తామని అన్నారు. అనుమతి తీసుకున్నప్పటికీ.. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదని వివరించారు. రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుత తరుణంలో పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని సూచించారు.




    First published:

    Tags: Andhra Pradesh, Coronavirus, Gautam Sawang

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు