DGP GAUTAM SAWANG CLARIFIES ON SECURITY SITUATIONS IN ANDHRA PRADESH AK
ఆరోపణలు వద్దు... ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్(ఫైల్ ఫోటో)
AP DGP Gautam Sawang: మద్యం, డబ్బు ఎన్నికల్లో విచ్చవిడిగా పంపిణీ జరగకుండా చూడబోతున్నామని డీజీపీ సవాంగ్ వెల్లడించారు. మద్యం, డబ్బుతో అభ్యర్థులు పట్టుబడితే అనర్హత వేటు పడుతుందని... నిఘా యాప్ ద్వారా విజయవాడలోనే 12 కేసులు నమోదు చేశామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంలో పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందిందని వస్తున్న ఆరోపణలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. . ఎన్నికల కోసం 59, 549 మంది పోలీసులు విధులు నిర్వహించబోతున్నారన్నారు. ఎంపీ, జెడ్పీపీ ఎన్నికల పోలింగ్ స్టేషన్స్ వద్ద 27, 735 పోలీసులు, సమస్యాత్మక ప్రాంతాల్లో 4399 మంది పోలీసులు విధుల్లో ఉంటారని ఏపీ డీజీపీ వివరించారు. భద్రత కోసం 54 డ్రోన్లు, బాడీ ఓన్ కెమెరాలు 1120 , శాటిలైట్ ఫోన్స్ 22 వినియోగించనున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆపరేషన్ సురా పేరుతో రికార్డ్ స్థాయిలో నాటుసారా స్థావరాలు ధ్వంసం చేశామని చెప్పారు.
మద్యం, డబ్బు ఎన్నికల్లో విచ్చవిడిగా పంపిణీ జరగకుండా చూడబోతున్నామని డీజీపీ సవాంగ్ వెల్లడించారు. మద్యం, డబ్బుతో అభ్యర్థులు పట్టుబడితే అనర్హత వేటు పడుతుందని... నిఘా యాప్ ద్వారా విజయవాడలోనే 12 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 35 కొట్లాట కేసులు, 11,386 బైండోవర్ కేసులు నమోదయ్యాయని అన్నారు. 10,980 మందిని బైండొవర్ చేశామన్నారు. అక్రమంగా తరలిస్తున్న 1,84,84,800 రూపాయల డబ్బుని, 2.551 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. 10, 514 ఆయుధాలకి 8015 వెపెన్స్ డిపాజిట్ అయ్యాయన్న ఏపీ డీజీపీ... పోలీసులు అంతటా అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పోలీస్ యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని అన్నారు. తొందరపాటుతో తమపై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించిన గౌతమ్ సవాంగ్... తమ విధులు సక్రమంగా నిర్వహిస్తున్నామని అన్నారు. జెడ్పీ, ఎంపీపీల నామినేషన్ల సమయంలో వివిధ ఘటనలకు సంబంధించి 43 నివేదికలు, మున్సిపల్ నామినేషన్స్‌లో 14 రిపోర్ట్స్ అందాయని వివరించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.