హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ హైకోర్టుకు హాజరైన డీజీపీ సవాంగ్... ఆ కేసులో...

ఏపీ హైకోర్టుకు హాజరైన డీజీపీ సవాంగ్... ఆ కేసులో...

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌, హైకోర్టు

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌, హైకోర్టు

ప్రభుత్వ న్యాయవాదుల వ్యవహార శైలి కారణంగా హైకోర్టు, ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అభిప్రాయం ప్రజలలోకి వెళుతోందని ఇది ఎవ్వరికీ మంచిది కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మద్యం అక్రమరవాణా కేసులో సీజ్ చేసిన వెహికల్స్‌ను విడుదల చేసే అంశంపై హైకోర్టులో జరిగిన విచారణకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బోర్డులో కింది స్థాయిలో ఉన్న చిన్నచిన్న లోపాలను సరిచేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. ప్రభుత్వం వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రభుత్వం తరుపున న్యాయవాదులు సరైన విధంగా గైడ్ చేయడం లేదని న్యాయమూర్తి అన్నారు. ప్రభుత్వ న్యాయవాదుల వ్యవహార శైలి కారణంగా హైకోర్టు, ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అభిప్రాయం ప్రజలలోకి వెళుతోందని ఇది ఎవ్వరికీ మంచిది కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపున న్యాయవాది డిఎస్ఎన్వీ ప్రసాద్ బాబు వాదనలు వినిపించారు.

డీజీపీ కోర్టుకు హజరు కావాల్సినంత కేసు ఇది కాదని... కానీ కోర్టుకు ఎవరైనా సమానమే అని న్యాయమూర్తి అన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ నిజాయితీ, నిబద్ధత కలిగిన కలిగిన ఆఫీసర్ అని తనకు తెలుసు అంటూ డిజిపి గౌతం సవాంగ్‌కు కితాబిచ్చారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొని విధులు నిర్వహిస్తున్నారని పోలీస్ శాఖను ఆయన అభినందించారు. మరోవైపు కేసుల్లో వున్న వాహనాలు ఆయా శాఖలకు అప్పగించాలని మెమో జారీ చేశామని కోర్టుకు డీజీపీ సవాంగ్ తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, AP DGP, AP High Court, Gautam Sawang

ఉత్తమ కథలు