హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tirumala Temple: తిరుమలకు క్యూ కట్టిన భక్తులు.. నేడు శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం

Tirumala Temple: తిరుమలకు క్యూ కట్టిన భక్తులు.. నేడు శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం

ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఉండేందుకు జనవరి 1న, అలాగే వైకుంఠ పర్వదినాల సందర్భంగా జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనం మాత్రమే కల్పిస్తారు. ఆ పది రోజుల్లో దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని టీటీడీ స్పష్టం చేసింది.

ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఉండేందుకు జనవరి 1న, అలాగే వైకుంఠ పర్వదినాల సందర్భంగా జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనం మాత్రమే కల్పిస్తారు. ఆ పది రోజుల్లో దర్శనాల కోసం ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని టీటీడీ స్పష్టం చేసింది.

Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఇవాళ భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. మొన్నటి వరకు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇవాళ ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఉండడంతో భారీగా భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు.. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం చూసేందుకు భక్తులు క్యూ కట్టారు.

ఇంకా చదవండి ...

  Tirumala Temple TTD Pushpa Yagam: పరమ పవిత్రమైన కార్తీక మాసం (Karithika Masam)లో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala tirupati devasthnam)లోని శ్రీవారి ఆలయంలో ఇవాళ పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. వేదమూర్తులు, ఆలయ పండితుల ఆధ్వర్యంలో ఈ వేడుక శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ అంకురార్పణ నిర్వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి (lord venkateswara swamy) ఆలయంలో రెండో అర్చన, రెండో గంట, నైవేద్యం పూర్తయిన తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి తీసుకువస్తారు. అక్కడ స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించి.. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత నాలుగు మాడవీధుల్లో మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

  పుష్పయాగ మహోత్సవం కారణంగా వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవాన్ని రద్దు చేశారు. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన జారీ చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీడీ ప్రజా సంబంధాల అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ పుష్పయాగానికి అంకురార్పణ జరగనుండగా.. నవంబరు 11వ తేదీన యాగ మహోత్సవం నిర్వహిస్తారు.

  ఇదీ చదవండి: టార్గెట్ 2024.. కలుస్తున్న టీడీపీ-జనసేన..! సెట్ చేస్తున్న బీజేపీ సీనియర్…?

  పుష్పయోగం సందర్భంగా మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం జరుగుతుంది. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా వర్చువల్ ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

  ఇదీ చదవండి: విద్యార్థి సంఘాల ముసుగులో దాడి.. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు వద్దంటూ మంత్రి సరేష్ ఫైర్

  మరోవైపు శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. మంగళవారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం 3.26 కోట్లు వచ్చింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. కాగా, నిన్న ఒక్క రోజు 32,816 మంది భక్తులు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. అలాగే 14,459 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు.

  ఇదీ చదవండి: ఏపీలో 40 రూపాయలకే పెట్రోల్ ఇచ్చేవాళ్లం.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

  ఓ వైపు పుష్పయాగ మహోత్సవానికి అంతా సిద్ధమైతే.. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన మిన్నంటుతోంది.  2010లో టీటీడీ నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది..  ఆ విధంగానే సొసైటీలు ఏర్పాటయ్యాయి.. అయితే సీఎం జగన్ గతంలో.. తన పాద యాత్ర సమయంలో ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని భరోసా కల్పించారని ఉద్యోగులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా కార్పొరేషన్‌ చేయడంతో ఆందోళన బాటు పట్టారు.  వారి ఆందోళనలకు జనసేనాని పవన్ సైతం మద్దతు ప్రకటించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tirumala brahmotsavam 2021, Ttd, Ttd news

  ఉత్తమ కథలు