news18-telugu
Updated: January 2, 2020, 8:55 AM IST
ప్రతీకాత్మక చిత్రం
నిత్యం భక్త జన సందోహంతో కిక్కిరిసిపోయే తిరుమలకు ప్రస్తుతం రద్దీ తగ్గిపోయింది. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో భక్తులతో కిక్కిరిసిపోయిన తిరుమల.. ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతోంది. సంక్రాంతి సెలవులకు ఇంకా వారం రోజులు ఉండటంతో.. భక్తుల రాక తగ్గిపోయింది. గురువారం ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని మూడు కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు ఉండటం గమనార్హం. సాధారణ సమయాల్లో స్వామి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూసే భక్తులకు.. ఇప్పుడు గరిష్టంగా రెండు గంటల్లో దర్శనం జరుగుతోంది. ఇక ప్రత్యేక దర్శనం,టైమ్ స్లాట్,దివ్య దర్శనం టోకెన్లు కలిగివున్న భక్తులకు గంట నుంచి రెండు గంటల్లో దర్శనం జరుగుతోంది. ఇక బుధవారం స్వామి వారిని 95వేల మంది దర్శించుకున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. స్వామి వారి హుండీకి రూ.3.93కోట్లు ఆదాయం సమకూరినట్టు చెప్పారు.కొద్ది రోజుల వరకే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.
Published by:
Srinivas Mittapalli
First published:
January 2, 2020, 8:54 AM IST