తిరుమలలో భక్తుల రద్దీ..కిక్కిరిసిన కంపార్ట్ మెంట్లు..!

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 3:14 PM IST
తిరుమలలో భక్తుల రద్దీ..కిక్కిరిసిన కంపార్ట్ మెంట్లు..!
  • News18
  • Last Updated: June 6, 2018, 3:14 PM IST
  • Share this:
భక్త జనంతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవులు ముగియనుండడంతో వారం రోజులగా తిరుమలలో రద్దీ ఎక్కువయింది. శ్రీవారి దర్శనానికి ఒకటి నుంచి రెండో రోజులు   ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవాళ 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా.. టైంస్లాట్, నడక, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

ఒకప్పుడు రోజులకు లక్ష మందికి పైగా శ్రీవారిని దర్శించుకునే వారు. కానీ ఇప్పుడా సంఖ్యను 80వేలకు తగ్గించారు. దీంతో వేంకటేశ్వరుడుని దర్శించుకునేందుకు వస్తున్నభక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం కాలినడకన వచ్చే భక్తులకు రోజుకు 20వేల టైం స్లాట్ టికెట్లు  ఇస్తున్నారు. మరో 20వేల మంది వరకు ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శనం (రూ.300) టికెట్ ను కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు పలు రకాల సేవల టికెట్లను  కొనుగోలు చేసే వారి సంఖ్య మరో పదివేల వరకు ఉంటోంది.

కానీ రోజుకు లక్ష మంది దాకా తిరుమల దర్శనానికి వస్తున్నారు. వారిలో చాలా మందికి దర్శన భాగ్యం కలగడం లేదు. ఎన్నో కష్టాలుపడి ఏడుకొండల చెంతకు వస్తున్న భక్తులు.. స్వామిని దర్శించుకోకుండానే వెను దిరుగుతున్నారు. రోజుల తరబడి వేచి చూడలేక, అద్దె గదులు దొరక్క ఇబ్బందిపడుతున్నారు. చివరకు అఖిలాండం వద్ద కర్పూరం  వెలిగించి.. కొబ్బరికాయ కొట్టి వెనుదిరుగుతున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: May 31, 2018, 4:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading