Home /News /andhra-pradesh /

DEVARAGATTU BUNNY FESTIVAL 2020 MORE THAN ONE LAKH PEOPLE ATTENDED BUNNY FESTIVAL AND MANY PEOPLE INJURED NK

Devaragattu Festival 2020: దేవరగట్టులో ఉద్రిక్తత. కర్రల సమరంలో పదుల సంఖ్యలో గాయాలు

దేవరగట్టులో ఉద్రిక్తత. కర్రల సమరంలో పదుల సంఖ్యలో గాయాలు (File)

దేవరగట్టులో ఉద్రిక్తత. కర్రల సమరంలో పదుల సంఖ్యలో గాయాలు (File)

Devaragattu Bunny Festival 2020: కరోనా కారణంగా ఈ సంవత్సరం దేవరగట్టు బన్నీ ఉత్సవం జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా... స్థానికులు జరుపుకున్నారు.

    Devaragattu Bunny Festival 2020: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే జరగకూడదని భావించిందో అదే జరిగింది. 1500 మంది పోలీసులు, 30 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా... కర్నూలు జిల్లా... దేవరగట్టులో ప్రతి సంవత్సరం లాగే... ఈసారి కూడా భారీగా బన్నీ ఉత్సవం జరిగింది. భారీగా కర్రలతో కొట్టేసుకున్నారు. చాలా మందికి గాయాలయ్యాయి. నిజానికి ఈ సంవత్సరం కరోనా ఉంది కాబట్టి... ప్రభుత్వం కర్రల సమరానికి అనుమతి ఇవ్వలేదు. ముందుగానే కర్నూలు పోలీసులు పెద్ద ఎత్తున దేవరగట్టులో మోహరించారు. ఐతే... రాత్రి 10 తర్వాత పోలీసులు... కాస్త కంట్రోల్ వదిలేశారు. అంతే... లక్ష మంది దాకా బన్నీ ఉత్సవానికి తరలివచ్చేశారు. పోలీసుల ఆంక్షల్ని పట్టించుకోలేదు.

    ప్రతి సంవత్సరం దసరా సమయంలో మాలమల్లేశ్వరస్వామి కళ్యాణోత్సవం జరుపుతారు. ఆ తర్వాత... విగ్రహాల్ని ఊరేగిస్తూ... జైత్రయాత్ర నిర్వహిస్తారు. ఈ సమయంలో స్థానిక నెరినికి, సుళువాయి, విరుపాపురం, అరికేరి, ఎల్లార్తి గ్రామాల ప్రజలు... కర్రలు, కాగడాలతో దేవరగట్టుకు వస్తారు. మాలమల్లేశ్వరస్వామి విగ్రహాన్ని దక్కించుకోవడానికి కర్రలతో సమరానికి దిగుతారు. ఈసారీ అదే జరిగింది. అక్కడో చిన్నపాటి యుద్ధ వాతావరణం కనిపించింది. కాగడాలు విసురుకుంటూ, తొక్కిసలాట జరుపుకుంటూ... కర్రలతో కొట్టుకున్నారు.

    ఎలాగూ ఉత్సవం జరగదు కదా అని పోలీసులు... తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చెయ్యలేదు. తీరా ఇంత మంది గాయపడేటప్పటికి... వారికి వెంటనే చికిత్స అందించేందుకు వీలు కాకుండా పోయింది. వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చింది.

    మొత్తానికి ప్రజలు దేవరగట్టు చేరనివ్వకుండా చెయ్యాలని చూసిన జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు ఫలించకుండా పోయాయి. కరోనా వచ్చినా సంప్రదాయాన్ని వదిలే ప్రసక్తే లేదంటూ... ప్రజలు పట్టుదల చూపించారు. దేవరగట్టుకు ఎవరూ రాకుండా ఉండాలని ముంబై చెక్ పోస్ట్ దగ్గర 50 సీసీ కెమెరాలు పెట్టి మరీ నిఘా కొనసాగించినా... ప్రజలు చాలా తెలివిగా... రహస్య కొండల మార్గాల్లో దేవరగట్టు చేరారు. బన్నీ ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రతీ సంవత్సరం ఇంతే. గాయాలు తగిలినా... పర్వాలేదంటారే తప్ప... ఉత్సవం మాత్రం ఆపే ప్రసక్తే లేదంటారు స్థానికులు. ఇది తమ ఆచారం అనీ... దీన్ని మానే ప్రసక్తే లేదని తెలిపారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Kurnool

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు