ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండో విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 44లక్షల 48వేల మంది తల్లుల ఖాతాలో రూ.6,673 కోట్లు జమ చేసింది. దీని ద్వారా 84లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ లైన్ ద్వారా నగదు జమ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తమ పిల్లలను బడికి పంపుతున్న ప్రతి తల్లి ఖాతాలో రూ.14వేల చొప్పున జమవుతున్నాయి. నిజానికి రూ.15వేలు జమకావాల్సి ఉండగా.. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం వెయ్యి రూపాయలను టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కు బదిలీ చేసింది. సీఎం పథకాన్ని ప్రారంభించిన కొద్దిసేపటికే సొమ్ములు జమ కావడం ప్రారంభమైంది.
బ్యాంక్ ఖాతాలో అమౌంట్ పడిన తర్వాత ప్రతి లబ్ధిదారునికి SMS వస్తుంది. కొందమందికి ఏ కారణం చేతనైనా మెసేజ్ రాకపోతే అమ్మఒడి నగదు పడిందా లేదా తెలుసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంక్ అధికారులతో మాట్లాడి SMS అలెర్ట్ నెంబర్లను ప్రజలకు అందించింది. అమ్మఒడిని SMS రూపంలో తెలుసుకోటానికి ఈ కింద ఇవ్వబడిన నెంబర్లకు వారి బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిన నెంబర్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వాలని అదికారులు పేర్కొన్నారు.
లబ్ధిదారులు ఫోన్ చేయాల్సిన నంబర్లు:
- యాక్సిస్ బ్యాంక్ -18004195959
- ఆంధ్రా బ్యాంక్ (యూనియన్ బ్యాంక్) -09223011300
- అలహాబాద్ బ్యాంక్ -09224150150
- బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB)-09223011311
- భారతీయ మహిళ బ్యాంక్ (BMB)-09212438888
- ధనలక్ష్మీ బ్యాంక్ -08067747700
- IDBI బ్యాంక్ -18008431122
- కోటక్ మహీంద్రా బ్యాంక్ -18002740110
- సిండికేట్ బయాంక్ -09664552255 లేదా 08067006979
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)-18001802222 or 01202490000
- ఐసీఐసీఐ బ్యాంక్ -02230256767
- HDFC బ్యాంక్-18002703333
- బ్యాంక్ ఆఫ్ ఇండియా (BoI)-09015135135
- కెనరా బ్యాంక్ -09015483483
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -09222250000
- కర్నాటక బ్యాంక్ - 18004251445
- ఇండియన్ బ్యాంక్ -09289592895
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)-09223766666
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -09223008586
- UCO బ్యాంక్ -09278792787
- విజయ బ్యాంక్ -18002665555
- యస్ బ్యాంక్ - 09223920000
- కరూర్ వైశ్య బ్యాంక్ (KVB)-09266292666
- ఫెడరల్ బ్యాంక్ - 8431900900
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ -04442220004
- సౌత్ ఇండియన్ బ్యాంక్ -09223008488
- సరస్వత్ బ్యాంక్ -9223040000
- కార్పొరేషన్ బ్యాంక్ -09289792897
- పంజాబ్ సింథ్ బ్యాంక్ -1800221908
- SBIలో విలీనమైన బ్యాంకులు (SBH, SBP, SBT, SBM & SBBJ)-09223766666
- యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -09015431345 or 09223008586
- దేనా బ్యాంక్ -09289356677
- బంధన్ బ్యాంక్ -18002588181
- RBL బ్యాంక్ -18004190610
- DCB బ్యాంక్ -7506660011
- కాథలిక్ సిరియన్ బ్యాంక్ -09895923000
- కేరళ గ్రామీణ్ బ్యాంక్ -9015800400
- తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ -09211937373
- సిటీ బ్యాంక్ -9880752484
- IDFC ఫస్ట్ బ్యాంక్ -18002700720
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర -18002334526
- ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ -08067205757
- ది సిటీ యూనియన్ బ్యాంక్ -9278177444
- ఇండస్ ఇండ్ బ్యాంక్ -18002741000
- ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)-8424026886
- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ -9243012121
- ఒడిశా గ్రామ్య బ్యాంక్ -8448290045
- బరోడా గుజరాత్ గ్రామీన్ బ్యాంక్ -7829977711
- కర్నాటక గ్రామీన్ బ్యాంక్ -9015800700
- ఆంధ్రప్రగతి గ్రామీణ్ బ్యాంక్ (APGB) -09266921358
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (APGVB) -9289222024
- సప్తగిరి గ్రామీణ బ్యాంక్ (SGB) - 08572233598
లక్షలాది మంది ఖాతాల్లో నగదు జమ చేస్తున్నందున ప్రక్రియలో కొంత ఆలస్యమైన లబ్దిదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు. అలాగే నగదు డ్రా చేసుకునేందుకు గుంపులు గుంపులుగా బ్యాంకులకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. కొవిడ్ మార్గద్శకాలు పాటిస్తూ నగదు డ్రా చేసుకోవాలని చెప్తున్నారు.
Published by:Purna Chandra
First published:January 11, 2021, 15:59 IST