బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం... తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు...

Depression in Bay of Bengal : లేటుగా అయినా లేటెస్టుగా వస్తా అన్నట్లు మారింది నైరుతీ వాతావరణం. ఆల్రెడీ రుతుపవనాలు చురుగ్గా ఉండగా... అదే సమయంలో వాటికి బూస్ట్ ఇస్తూ... బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం శనివారం అల్పపీడనంగా మారబోతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 2, 2019, 5:40 AM IST
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం... తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సముద్రం చాలా చిత్రమైనది. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పలేం. ఓవైపు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు జోరు వర్షాలు కురిపిస్తుంటే... సరిగ్గా అదే సమయంలో... బంగాళాఖాతంపై... ఉత్తర ఆంధ్ర దగ్గర్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది ఇప్పుడిప్పుడే గుండ్రంగా తిరుగుతోంది. అది శనివారం నాటికి అల్పపీడనంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే... ఇప్పటికే దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. ఈ రోజంతా దాని వల్ల ఉత్తరాంధ్రలో, ఏపీలో మరికొన్ని చోట్లా... ఉరుములతో వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయట. ఇక తీరం వెంట గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వస్తాయంటున్నారు. అంత వేగంతో గాలులు వస్తున్నప్పుడు సముద్రంలోకి వెళ్లడం ప్రమాదం కదా. అందుకే చేపల వేటకు వెళ్లొద్దని కూడా సూచించింది.

శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడకపోతా... ఆదివారమైనా ఏర్పడవచ్చనే అంచనాలున్నాయి. అయినప్పటికీ రుతుపవనాలు చురుకుగా ఉండటం వల్ల... వర్షాలు జోరుగా పడుతున్నాయి. ఇంకో మంచి విషయమేంటంటే... వాతావరణం మరింత చల్లబడుతుందంటున్నారు. ఇప్పటికే వేడి వాతావరణం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా నష్టం జరిగింది. అటవీ సంపద చాలా వరకూ కాలిపోయింది. ఇప్పుడీ వర్షాలతో మళ్లీ పచ్చదనం పెరిగే అవకాశాలున్నాయి.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు