AP Weather: రానున్న మూడు రోజులపాటు ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు

ప్రతీకాత్మక చిత్రం

రానున్న మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తామయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.

  • Share this:
    రానున్న మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తామయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. భారత వాతావరణశాఖ(ఐఎండీ) సూచనల ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రం దానికి అనుసంధానంగా ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు చెప్పారు. ఆ తర్వాత 24 గంటల్లో అల్పపీడనం.. వాయుగుండంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆదివారం సాయంత్రంలోగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు.

    అలాగే తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని కన్నబాబు తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. తీర ప్రాంత, లోతట్టు ప్రాంత ప్రజలకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
    Published by:Sumanth Kanukula
    First published: