వైసీపీ వెనక్కి తగ్గిందా? కరకట్టపై కూల్చివేతలు ఆగినట్లేనా?

Andhra Pradesh : కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసేందుకు వారంపాటు టైమ్ ఇచ్చిన వైసీపీ... గడువు తీరిపోయినా... ఎందుకు సైలెంట్‌గా ఉంది? కూల్చివేతల విషయంలో వెనక్కి తగ్గుతోందా?

Krishna Kumar N | news18-telugu
Updated: October 6, 2019, 8:31 AM IST
వైసీపీ వెనక్కి తగ్గిందా? కరకట్టపై కూల్చివేతలు ఆగినట్లేనా?
సీఎం వైఎస్ జగన్
  • Share this:
AP Politics : ఏపీలో అధికారంలోకి రాగానే... వైసీపీ ప్రభుత్వం అత్యంత ఆవేశంగా... టీడీపీ అప్పటివరకూ వాడుకున్న ప్రజావేదికను కూల్చివేసింది. రూ.40 కోట్ల ఖర్చుతో నిర్మించిన భవనాన్ని నేలమట్టం చెయ్యడమే కాక... కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తామని ప్రకటించింది. ఆ ప్రకారమే... ఇటీవల అధికారులు... టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్న ఇల్లు సహా... అక్రమ నిర్మాణాలకు నోటీసులు పంపారు. వారంలోగా ఖాళీ చెయ్యాలన్నది ఆ నోటీసుల్లో సారాంశం. దాంతో ఈ విషయం రాజకీయంగా కలకలం రేపింది. అక్రమ నిర్మాణాల్ని కూల్చేయాలని వైసీపీ నేతలు, కూల్చడానికి వీల్లేదని టీడీపీ నేతలూ వాదించారు. ఇంతలో... వారం గడిచిపోయింది. మరో మూడ్రోజులు కూడా అయిపోయాయి. కానీ... కూల్చివేతలు మాత్రం మొదలవ్వలేదు. కారణమేంటి? కూల్చివేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన వైసీపీ ఇప్పుడు ఎందుకు సైలెంటైపోయింది?

వైసీపీ మౌనం వెనక టీడీపీ రాజకీయ ఎత్తుగడ ఉందని తెలుస్తోంది. కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలున్న కొందరు టీడీపీ నేతలు... ఇటీవల బీజేపీలో చేరారు. తమ ఇళ్లను కూల్చనివ్వకుండా అడ్డుకోవాలని పార్టీ హైకమాండ్‌ని కోరారని తెలుస్తోంది. దాంతో బీజేపీ హైకమాండ్ నుంచీ వైసీపీ ప్రభుత్వానికి ఆదేశాలు వచ్చాయనీ... అందువల్లే వైసీపీ సర్కార్ సైలెంటైపోయిందనే వాదన వినిపిస్తోంది. ఇంతకుముంది కరెంంటు ఒప్పందాల విషయంలో కేంద్రానికి ఎదురుతిరిగిన వైసీపీ ప్రభుత్వం... ఆ తర్వాత మెత్తబడక తప్పలేదు. ఇప్పుడు కరకట్ట విషయంలోనూ కేంద్రం అనధికారిక ఆదేశాలు... వైసీపీ దూకుడుకి బ్రేక్ వేశాయనే వాదన ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది.

ముందుంది కూల్చివేత పండుగ : కూల్చివేతలకు బ్రేక్ పడిందనీ, వైసీపీ తమ దారికి వచ్చిందని ఓవైపు టీడీపీ నేతలు చెప్పుకుంటుంటే... అంత లేదంటున్నాయి వైసీపీ వర్గాలు. దసరా సెలవులు కావడంతో... ఏపీలో ప్రజలంతా పండుగ మూడ్‌లో ఉంటారు కాబట్టి... ఇలాంటి సమయంలో... కూల్చివేతలూ అవీ చేస్తే... వాటిని అడ్డుకునేందుకు టీడీపీ ఏ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకో పిలుపిస్తే... లేనిపోని లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని భావించిన ప్రభుత్వం... పండగ తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని డిసైడైనట్లు తెలుస్తోంది. కాబట్టి టీడీపీ నేతల ఆనందం... ఈ నాల్రోజులే అంటున్నాయి వైసీపీ వర్గాలు. కేంద్ర పరిధిలో కరెంటు ఒప్పందాలు... ఇదివరకే కుదరడం వల్ల... ఆ విషయంలో తమ అధినేత వెనక్కి తగ్గారే తప్ప... కేంద్రానికి తలొగ్గి కాదనీ... అక్రమ నిర్మాణాల్ని కూల్చివేసిన తర్వాత... టీడీపీ నేతలకు తత్వం బోధపడుతుందని అంటున్నారు.
First published: October 6, 2019, 8:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading