విజయవాడ విమానంలో గాల్లోనే కుదుపులు.... ఆతర్వాత

ఎయిరిండియాకు చెందిన విమానం నిన్న సాయంత్రం 7:28 గంటలకు ఢిల్లీలో బయలుదేరింది. రాత్రి 9:40 గంటలకు ఈ విమానం గన్నవరం చేరుకోవాల్సి ఉంది.

news18-telugu
Updated: September 22, 2019, 7:47 AM IST
విజయవాడ విమానంలో గాల్లోనే కుదుపులు.... ఆతర్వాత
విజయవాడ విమానంలో గాల్లోనే కుదుపులు.... ఆతర్వాత
  • Share this:
ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన ఎయిరిండియా విమానంపై  ఉరుములు, పిడుగుల ప్రభావం పడింది. దీంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈ అనుకోని ఘటనతో  విమాన సిబ్బంది కొందరు గాయపడ్డారు. ఎయిరిండియాకు చెందిన విమానం నిన్న సాయంత్రం 7:28 గంటలకు ఢిల్లీలో బయలుదేరింది. రాత్రి 9:40 గంటలకు ఈ విమానం గన్నవరం చేరుకోవాల్సి ఉంది.

విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం ప్రారంభమైంది. విమానంపై పిడుగు పడకున్నా ఆ ప్రభావం మాత్రం విమానంపై పడింది. దీంతో విమానం గాల్లో ఊయలలా అటూఇటూ ఊగిపోయింది. ప్రయాణికులకు భయభ్రాంతులు గురయ్యారు. ప్రయాణికులు గాయపడకపోయినప్పటికీ కొందరు సిబ్బంది మాత్రం గాయపడ్డారు. విమానం గన్నవరంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.First published: September 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>