వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. పార్టీ పేరుపై రచ్చ..

ఎన్నికల కమిషన్ వద్ద నమోదైన ప్రకారం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పేరునే వాడాలని, అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పేరు వాడుతున్నారని అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: July 13, 2020, 2:45 PM IST
వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. పార్టీ పేరుపై రచ్చ..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వైసీపీ పేరుపై రాజకీయ రచ్చ జరుగుతున్న వేళ.. వైసీపీతో పాటు ఎలక్షన్ కమిషన్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైసీపీ గుర్తింపును రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారించిన కోర్టు.. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. వైసీపీ నిర్వాహకులు తమ పార్టీ పేరును అనుకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. లెటర్ హెడ్లు, పోస్టర్లు, బ్యానర్లలో ఉపయోగించే పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎన్నికల కమిషన్ వద్ద నమోదైన ప్రకారం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పేరునే వాడాలని, అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పేరు వాడుతున్నారని అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు వైసీపీతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

కాగా, వైసీపీలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పార్టీ క్రమశిక్షణను ఆయన ఉల్లంఘించారని.. కొన్ని రోజుల క్రితం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఐతే ఆ నోటీసులపై ఎవరూ ఊహించని విధంగా స్పందించారు రఘురామ. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీనని... వైసీపీ పేరుతో వచ్చిన షోకాజ్ నోటీసులకు స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈ క్రమంలోనే తమ పార్టీ పేరును వాడుకుంటున్నారని.. అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Published by: Shiva Kumar Addula
First published: July 13, 2020, 2:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading