తిరుమల తిరుపతి దేవస్థానంలో పెనుదుమారం రేగుతోంది. ఢిల్లీలో బ్రహ్మెత్సవాల సందర్భంగా స్థానిక సలహా కమిటీ.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని, సుమారు రూ.5కోట్ల అవినీతి జరిగిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో టీటీడీ చైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డి ఈ ఘటనపై విచారణకు విజిలెన్స్ అధికారులను ఢిల్లీకి పంపారు. అయితే, ఎవరో ఆకాశ రామన్న రాసిన ఉత్తరంపై టీటీడీ తమ మీద విచారణ జరిపించడాన్ని ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ అభ్యంతరం తెలిపారు. నిధుల దుర్వినియోగం వ్యవహారంపై ఆరోపణలు వచ్చిన తర్వాత డిప్యూటీ సెక్రటరీ స్థాయి అధికారి చేత తాము విచారణ చేయిస్తున్నామని, అదే సమయంలో టీటీడీ ఎస్సై స్థాయి అధికారిని విచారణకు పంపడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. టీటీడీ వైఖరి ఢిల్లీలో ఏపీ భవన్ విలువను తగ్గించేలా ఉందని ప్రవీణ్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారంపై టీటీడీ విజిలెన్స్ కమిషన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా విచారణ జరగలేదన్నారు. టీటీడీ వైఖరిని నిరసిస్తూ స్తానిక సలహా కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ప్రకటించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.