విశాఖ తూర్పు నౌకా దళానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్... ఎందుకంటే...

Vizag Eastern Naval Command : రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాజ్‌నాథ్ సింగ్ తొలిసారిగా తూర్పు నౌకా దళాన్ని సందర్శించబోతున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: June 30, 2019, 7:15 AM IST
విశాఖ తూర్పు నౌకా దళానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్... ఎందుకంటే...
రాజ్‌నాథ్‌సింగ్ (Image : Twitter / ANI)
Krishna Kumar N | news18-telugu
Updated: June 30, 2019, 7:15 AM IST
దేశం భద్రంగా ఉండాలంటే... మన త్రివిధ దళాలు నిరంతరం సన్నద్ధంగా ఉండాలి. కేంద్ర రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే... సియాచిన్‌ లాంటి యుద్ధ క్షేత్రాలకు వెళ్లి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. తాజాగా ఆయన... రెండ్రోజుల పర్యటన కోసం విశాఖపట్నం వచ్చారు. ఇవాళ తూర్పు నౌకా దళాన్ని కలిసి... అక్కడి పరిస్థితులను తెలుసుకోనున్నారు. తీర ప్రాంత భద్రత, నౌకా దళం సన్నద్ధత వంటి అంశాలపై ఈస్ట్రన్ సీబోర్డ్ ప్రధాన కార్యాలయంలో రాజ్ నాథ్ చర్చించనున్నారు. తన పర్యటనలో భాగంగా... ఆయన నౌకలను, సబ్ మెరైన్లనూ పరిశీలించనున్నారు. అక్కడి నౌకా దళ సిబ్బంది, స్టాఫ్‌తో మాట్లాడి... వాస్తవ పరిస్థితులు తెలుసుకోబోతున్నారు.

ఈ పర్యటనకు ప్రత్యేక కారణాలేవీ లేనప్పటికీ... తీర ప్రాంతాల నుంచీ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం ఉందన్న సంకేతాలు... శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారన్న నిఘావర్గాల హెచ్చరికల వంటివి ఇటీవల కలకలం రేపాయి. ఆ క్రమంలో... తూర్పు తీర ప్రాంతాల భద్రత ఎలా ఉందో తెలుసుకునేందుకు రాజ్‌నాఖ్ విశాఖలో పర్యటిస్తున్నారని అనుకోవచ్చు.

First published: June 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...