విజయవాడలో తగ్గుతున్న రియల్ జోరు... అందరి చూపు విశాఖ వైపేనా...

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంతో విజయవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రోజురోజూకీ తగ్గుముఖం పడుతోంది. భారీ స్థాయి నిర్మాణలు సగం దశలోనే ఆగిపోతున్నాయి.

news18-telugu
Updated: February 13, 2020, 7:05 AM IST
విజయవాడలో తగ్గుతున్న రియల్ జోరు... అందరి చూపు విశాఖ వైపేనా...
విజయవాడలో తగ్గుతున్న రియల్ జోరు... అందరి చూపు విశాఖ వైపేనా...
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరు తగ్గుముఖం పట్టింది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో రియల్ జోరు ఆకాశన్నంటింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పడుతోందనే చెప్పాలి. ఫలితంగా రియల్ వ్యాపారుల్లో కలవరం మొదలయ్యింది. అమరావతిగా రాష్ట్ర రాజధానిని ప్రకటించిన సమయం నుంచి నిన్న మొన్నటిదాకా రియల్ పరుగులు పెట్టింది. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టుబడులుపెట్టారు.

ప్రధానంగా తెలంగాణ కేంద్రంగా నడిచిన రిలయ్ వ్యాపార కేంద్రాలన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లాయి. ఒక్కసారిగా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇళ్ల అద్దెలు సైతం సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తెరపైకి తేవడంతో గందరగోళం నెలకొంది.

అందులోనూ పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ప్రకటించిన తర్వాత విజయవాడలో భూముల ధరలు పడిపోయాయి. అప్పటిదాకా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రూ.కోట్ల లాభాలు చవిచూసిన వ్యాపారులకు కనీసం రూ.వేలు కూడా రాకపోవడంతో వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.

కోటి ఆశలతో భారీస్థాయి నిర్మాణాలు చేపట్టిన వ్యాపారులకు ప్రభుత్వ నిర్ణయంతో అగమ్యగోచరంగా మారింది. విజయవాడ కేంద్రంగా సాగిన రియల్ వ్యాపారం విశాఖపట్నం వైపు వెళుతోంది. అయితే అక్కడి రైతులు మాత్రం ల్యాండ్ పూలింగ్‌కు అంత సులభంగా ఒప్పుకోవడం లేదు.భవిష్యత్తులో ఇప్పుడు అమరావతి రైతులకు వచ్చిన పరిస్థితి తమకు వస్తే ఏంటదన్న దానిపై స్థానిక రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించిన సమయంలో వెలగపూడి, మందడం, ఉద్ధండ రాయునిపాలెం, తుళ్లూరు ప్రాంతాల్లో ప్రభుత్వం పెద్దఎత్తున భూములను సేకరించింది. అందుకు రైతులకు కల్పించే ప్రయోజనాల దృష్ట్యా భారీగానే భూములను సమీకరించారు. తాజాగా విశాఖపట్నంలో మాత్రం ఆ పరిస్థితి కన్పించడం లేదు.
First published: February 13, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు