కరోనా వైరస్ ఎఫెక్ట్.. వినుకొండ మున్సిపాలిటీ కీలక నిర్ణయం..

వినుకొండ పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో పలు బ్యాంకులను మూసివేయాలని వినుకొండ మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశించారు.

news18-telugu
Updated: July 9, 2020, 11:58 AM IST
కరోనా వైరస్ ఎఫెక్ట్.. వినుకొండ మున్సిపాలిటీ కీలక నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు లాక్‌డౌన్ అమలు చేశారు. ఇటీవల లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇవ్వడంతో అన్నిరంగాలు యథావిధిగా ప్రారంభం అయ్యాయి. అయితే లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులు ఇచ్చిన దగ్గరి నుంచి కరోనా కేసులు అధికమయ్యాయి. దీంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని వినుకొండ మున్సిపాలిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో వినుకొండ పట్టణంలో బ్యాంకులను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. వినుకొండ పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో పలు బ్యాంకులను మూసివేయాలని వినుకొండ మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశించారు.

దీంతో పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (మెయిన్ బ్రాంచ్), (ఏడిబి), ఆంధ్రాబ్యాంక్, విజయ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, చైత్యన్య గోదావరి బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరూర్ వైశ్య బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ తదితర బ్యాంకులు మూసివేసే బ్యాంకుల జాబితాలో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు.
Published by: Narsimha Badhini
First published: July 9, 2020, 11:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading