School Holidays: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పాఠశాలలకు సంబంధించి క్రిస్మస్ (Christmas), సంక్రాంతి (Sankranthi) సెలవుల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెలలో క్రిస్మస్ పండగ ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23 నుంచి క్రిస్మస్ సెలవనులను ప్రకటించింది. అంటే 23, 24, 25 తేదీల్లో స్కూళ్లకు సెలవులు (School Holidays) ఉంటాయి. అంటే 26వ తేదీ నుంచి స్కూళ్లను రీ ఓపెన్ చేస్తారు. అయితే కొన్ని స్కూళ్లకు మాత్రం ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు సెలవులను ప్రకటించారు. ఈ సెలవులు కేవలం క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు మాత్రమే వర్తిస్తాయి. ఇక తెలుగు వారందరూ పెద్ద పండుగా భావించే సంక్రాంతికి ఐదు రోజులు సెలవులు ఇచ్చారు.. జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆఈర్టీ) అకడమిక్ క్యాలెండర్‌లో పొందుపరిచింది.
క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లు డిసెంబర్ 31న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు ఉంటాయని ఎస్‌సీఈఆర్టీ వివరించింది. మిషనరీ పాఠశాలలకు మినహా తక్కిన పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. 17వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. జనవరి 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ కూడా సెలవు ఉంటుంది.
స్కూళ్ల సెలవులు అయితే ప్రస్తుతానికి ప్రకటించారు కానీ.. ప్రస్తుతం భారత దేశాన్ని ఒమిక్రాన్ కొత్త వేరియంట్ భయపెడుతోంది. చాలా వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే భారత్ లో వంద కేసులు దాటాయి. అయితే చాలామంది నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. డిసెంబర్ చివరి నాటికి కేసుల సంఖ్య కాస్త పెరగవచ్చని.. అలాగే జనవరి మధ్యలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని.. ఫిబ్రవరి నాటికి తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం ఉంటుంది అంటున్నారు. అదే పరిస్థితి నిజమైతే.. సంక్రాంతి సెలవుల తరువాత స్కూళ్లు తెరవడం చాలా కష్టంగా మారుతోంది.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు పోరాటంలో పవన్ మరో అస్త్రం.. డిజిటల్ క్యాంపెయిన్‌తో హీట్.. ట్విట్టర్ లో వైరల్
ఈ ఏడాది కరోనా కారణంగా ఇప్పటికే సగం విద్యా సంవత్సరం పోయింది. చాలా ఆలస్యంగా స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. చాలా వరకు సిలబస్ పూర్తిగా వెనుకబడింది. ఇలాంటి సమయంలో స్కూళ్లకు ఎంత తక్కువ సెలవులు ఇస్తే అంతమంచిదని విద్యార్థుల తల్లి దండ్రులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు.. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ ఇలా అన్నీ భయపెడుతూనే ఉన్నాయి. కరోనా తొలి రెండు వేవ్ లతో విద్యార్థులు చాలా వరకు నష్టపోయారు.. మళ్లీ కరోనా అంటే విద్యావ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Schools