హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Businessman Family: మోయలేని భారం.. బతకలేమని సందేశం.. విజయవాడలో వ్యాపారి కుటుంబం ఇలా..

Businessman Family: మోయలేని భారం.. బతకలేమని సందేశం.. విజయవాడలో వ్యాపారి కుటుంబం ఇలా..

బాధిత కుటుంబం (పాత ఫొటో)

బాధిత కుటుంబం (పాత ఫొటో)

రెండేళ్లుగా వ్యాపారంలో నష్టం.. పైగా కరోనా దెబ్బ.. వెరసి అప్పులు భారీగా పేరుకుపోవడం ఆ వ్యాపారి కుటుంబానికి మోయలేని భారంగా మారింది. బాధలు శాశ్వతంగా తీరేలా బతుకును ముగించాలనుకున్నారు. విజయవాడలో చోటుచేసుకుందీ ఘటన..

రెండేళ్లుగా వ్యాపారంలో భారీగా నష్టాలు.. పైగా కరోనా దెబ్బ.. కోలుకోడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వీలుపడలేదు.. ఈలోపే అప్పులు మోయలేని భారంగా మారాయి.. బాకీ తీర్చాల్సిందిగా రుణదాల నుంచి ఒళ్ళు పెరిగాయి.. మరోదారిలేక భార్యబిడ్డలను వెంటేసుకొని ఊరొదిలేశాడు.. బతుకును శాశ్వతంగా ముగించడమే తమ బాధలకు విముక్తి అని భావించాడా వ్యాపారి.. భ్యార్యాపిల్లల్ని ఒప్పించి.. అందరూ కలిసి లాడ్జిలో విషం తాగారు.. అయితే చిన్న ఫోన్ సందేశం వల్ల ప్రస్తుతానికి వారి ప్రాణాలు నిలిచాయి.. విజయవాడ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు చెప్పిన వివరాలివి..

కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని కొజ్జిలి పేటకు చెందిన జూపూడి వెంకటేశ్వరరావు(55) పప్పుధాన్యాల వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి భార్య రాధారాణి (48), కుమార్తెలు భవాని (28), శ్రావణి (27) ఉన్నారు. భవాని మానసిక దివ్యాంగురాలు. శ్రావణి బీటెక్‌ పూర్తి చేసింది. కొన్ని సంవత్సరాలుగా పప్పుధాన్యాల వ్యాపారం చేస్తున్న వెంకటేశ్వరరావుకు సుమారు కోటి రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి. దీంతో వెంకటేశ్వరరావు అప్పులపాలయ్యాడు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడం, అప్పులు తీర్చే దారి కనిపించక కుటుంబంతో కలిసి నెల రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈక్రమంలో..

మచిలీపట్నానికి చెందిన వ్యాపారి వెంకటేశ్వరావు కుటుంబం(పాత ఫొటో)

KCR | TRS plenary: కేసీఆర్ జాతీయ పార్టీ.. నేటి ప్లీనరీలో ప్రకటన.. పీకే ద్వారా చక్రంతిప్పేలా!



వెంకటేశ్వరావు కుటుంబం ఈనెల 8న విజయవాడ వచ్చి బస్‌స్టేషన్‌ సమీపంలోని బాలాజీ లాడ్జి డార్మెటరీలో ఒక గది అద్దెకు తీసుకున్నారు. దారులన్నీ మూసుకుపోయాయని నిర్ధారణకు వచ్చి, నలుగురూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో లాడ్జి గదిలోనే వారంతా విషం తాగారు. అయితే ఆత్మహత్యాయత్నానికి కొద్ది నిమిషాల ముందు చివరిసారిగా తన మామకు ఫోన్ లో మెసేజ్ పెట్టింది శ్రావణి.

PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు.. మళ్లీ ఆ ఆప్షన్ అందుబాటులోకి..


‘మావయ్యా.. మాగురించి ఎవరూ వెతకొద్దు.. మమ్మల్ని కాపాడటానికి కూడా రావొద్దు.. మేం చనిపోతున్నాం’ వ్యాపారి చిన్నకూతురు శ్రావణి మచిలీపట్నంలో ఉంటోన్న తర మామయ్య దేవత శ్రీనివాస్‌ ఫోన్‌కు మెసేజ్‌ చేసింది. తాము ఎక్కడున్నదీ శ్రావణి ఆ మెసేజ్ లో చెప్పడంతో శ్రీనివాస్‌ వెంటనే బాలాజీ డార్మెటరీ నంబర్ తెలుసుకొని ఫోన్ చేశాడు. ఫలానా వ్యక్తులు గదిలో ఆత్మహత్యాయత్నం చేశారని తెలియడంతో డార్మెటరీ సిబ్బంది పరుగున వెళ్లి వెంకటేశ్వరరావు ఉంటోన్న గది వద్దకు వెళ్లి తలుపు తట్టారు.. శ్రావణి తలుపు తీసి కింద పడిపోయింది.

CM KCR : ఆ క్యాన్సర్‌ మనదగ్గర తెచ్చుకోవద్దు.. 3టిమ్స్ ఆస్పత్రుల భూమిపూజలో కేసీఆర్ అనూహ్య వ్యాఖ్యలు


లాడ్జి వారు ఇచ్చిన సమాచారంతో కృష్ణలంక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. వ్యాపారి కుటుంబ సభ్యులు నలుగురూ పురుగు మందు తాగినట్లు గుర్తించిన పోలీసులు.. వారిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వ్యాపారి గదిలో పురుగుమందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి వెంకటేశ్వరావు పరిస్థితి విషమంగా ఉంది. మిగతా ముగ్గురూ చికిత్స తర్వాత కొద్దిగా కోలుకున్నారు. ఈ ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

First published:

Tags: Business, Businessman, Family suicide, Machilipatnam, Suicide attempt, Vijayawada

ఉత్తమ కథలు