లారీ ట్యూబులపై మృతదేహం.. కృష్ణాలో వరద కష్టాలు..

ఓ వైపు మనిషి చనిపోయాడన్న బాధ, మరోవైపు అంత్యక్రియలు కూడా సరిగా నిర్వహించలేకపోయామన్న ఆవేదన ఆ కుటుంబంలో మిగిలిపోయింది.

news18-telugu
Updated: August 16, 2019, 7:07 PM IST
లారీ ట్యూబులపై మృతదేహం.. కృష్ణాలో వరద కష్టాలు..
లారీ ట్యూబులపై పాడె కట్టిన దృశ్యం (Screen Grab -NTV)
  • Share this:
కృష్ణా జిల్లాలో వరద కష్టాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఊరు చుట్టూ నీరు చేరింది. ఇంట్లో నుంచి రోడ్డు మీదకు కూడా వెళ్లలేని పరిస్థితి. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చనిపోయాడు. అయితే, అతడికి అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. గ్రామం చుట్టూ నీరు చేరడంతో మృతదేహాన్ని శ్మశానానికి తీసుకుని వెళ్లడానికి కూడా బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు రెండు లారీ ట్యూబుల సాయంతో మృతదేహాన్ని శ్మశానానికి చేర్చారు. రెండు లారీ ట్యూబుల నిండా గాలి నింపారు. ఆ రెండింటినీ కలిపి తాళ్లతో కట్టారు. వాటిపై కర్రలతో పాడెను కట్టారు. దాని మీద మృతదేహాన్ని పడుకోబెట్టి శ్మశానం వరకు నీటి మీద తోసుకుంటూ తీసుకుని వెళ్లారు. ఓ వైపు మనిషి చనిపోయాడన్న బాధ, మరోవైపు అంత్యక్రియలు కూడా సరిగా నిర్వహించలేకపోయామన్న ఆవేదన ఆ కుటుంబంలో మిగిలిపోయింది. అంత్యక్రియలకు కూడా హాజరుకాలేని గ్రామస్తులు ఊరు ఒక చివర నిలబడి వరద నీటిలో అతడికి అంతిమ వీడ్కోలు పలికారు.
First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading