చిత్తూరులో దారుణం.. కరోనాతో చనిపోయాడని రోజంతా పొలాల్లోనే..

కరోనా వైరస్ సోకడం వల్లే హరిప్రసాద్ చనిపోయాడనుకుని అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్తులు, బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. మృతదేహాన్ని ఊరికి దూరంగా పంటపొలాల్లో ఉంచారు.

news18-telugu
Updated: April 30, 2020, 2:48 PM IST
చిత్తూరులో దారుణం.. కరోనాతో చనిపోయాడని రోజంతా పొలాల్లోనే..
ఊరికి దూరంగా పంటపొలాల్లో ఉంచిన మృతదేహం
  • Share this:
కరోనా వైరస్ పుణ్యమాంటూ మానవత్వ విలువలు మంటగలిసి పోతున్నాయి. తమకు కరోనా ఎక్కడ సోకుంతుందోననే భయంతో చనిపోయినవారికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఓ యువకుడు ఇటీవల లాక్‌డౌన్ నేపథ్యంలో బెంగుళూరు నుంచి సొంత ఊరికి కాలినడక వచ్చాడు. అనంతరం అనారోగ్యంతో చనిపోయాడు. కరోనా వైరస్ సోకడం వల్లే ఆ యువకుడు చనిపోయాడనుకుని బంధువులెవరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు. ఈ హ‌ృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లా రామసముద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రామసముద్రానికి చెందిన హరిప్రసాద్(28) బతుకుదెరువు కోసం బెంగుళూరుకు వెళ్లాడు. లాక్‌డౌన్ కారణంగా ఏ పనీ లేకపోవడంతో కాలినడకన సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు అనారోగ్యంతో చనిపోయాడు.

కరోనా వైరస్ సోకడం వల్లే హరిప్రసాద్ చనిపోయాడనుకుని అంత్యక్రియలు చేసేందుకు గ్రామస్తులు, బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. మృతదేహాన్ని ఊరికి దూరంగా పంటపొలాల్లో ఉంచారు. మృతదేహం నుంచి శాంపిల్స్ సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తే అతడికి వైరస్ సోకలేదని తేలింది. వైద్య పరీక్షల రిపోర్టులు వచ్చేంత వరకు మృతదేహానికి రెవెన్యూ సిబ్బంది కాపలా ఉన్నారు. 24 గంటల తర్వాత నెగిటివ్ అని తేలడంతో మృతదేహానికి బంధువులు అంత్యక్రియలు చేశారు.
First published: April 30, 2020, 2:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading