తెలంగాణ 'సిట్‌'కు పోటీగా ఏపీ 'సిట్'..డేటా యుద్ధం ఎటు దారితీయనుంది..?

ఇరు ప్రభుత్వాలు పోటాపోటీగా సిట్‌లు ఏర్పాట్లు చేయడంతో డేటా వార్ ఎక్కడికి దారితీస్తుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: March 7, 2019, 9:25 PM IST
తెలంగాణ 'సిట్‌'కు పోటీగా ఏపీ 'సిట్'..డేటా యుద్ధం ఎటు దారితీయనుంది..?
చంద్రబాబు, కేసీఆర్
  • Share this:
ఎన్నికల వేళ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య డేటాచౌర్యం యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు నేతలు. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేయడంతో వివాదం మరింత ముదిరింది. తెలంగాణ ప్రభుత్వానికి పోటీ ఏపీ గవర్నమెంట్ కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అడిషనల్ డీజీపీ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో 8 సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. ఫామ్-7 గుంటూరు, తుళ్లూరులో నమోదైన డేటా చౌర్యం కేసులపై సిట్ దర్యాప్తు చేయనుంది.

ఐజీ హరికుమార్, ఎస్‌ఐబీ ఎస్పీ రామకృష్ణ, గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ బాబు, సీఐడీ ఎస్సీ మేరీ ప్రశాంతి, ఫోరెన్సిక్ ల్యాబ్ అదనపు ఎస్పీ రామ్మోహన్ రావు సిట్‌లో సభ్యులుగా ఉంటారు. బుధవారం గుంటూరు గ్రామీణ ఎస్పీకి మంత్రి కళావెంకటరావు ఫిర్యాదు చేశారు. ఏపీకి చెందిన డేటాను దొంగిలించారంటూ వైసీపీ నేతలతో పాటు తెలంగాణ సీనియర్ పోలీస్ అధికారులపైనా కేసుపెట్టారు.

ఇక ఫామ్‌-7 ఫిర్యాదులపై దర్యాప్తునకు మరో సిట్ కూడా ఏర్పాటుచేసింది ఏపీ సర్కార్. ఎన్నికల కమిషన్‌కు వచ్చిన 252 ఫిర్యాదులపై ఐజీ వెంకటేశ్వర్రావు నేతృత్వంలోని దర్యాప్తు బృందం విచారణ చేయనుంది. టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి వైసీపీ కుట్రలు చేసిందని పలువురు నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులను దర్యాప్తుచేసేందుకు రెండు ప్రత్యేక బృందాలను నియమించింది ఏపీ ప్రభుత్వం.

అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం కూడా డేటా చౌర్యంపై వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటుచేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇన్‌చార్జిగా బెస్ట్ జోన్ హైదరాబాద్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు. ఈ బృందంలో స్టీఫెన్ రవీంద్రతో పాటు సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్, మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఉంటారు. హైదరాబాద్, సైబరాబాద్ జంట కమిషనరేట్ల పరిధిలో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్‌కు బదిలీ చేయనున్నారు. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో సిట్‌కు ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. ఇరు ప్రభుత్వాలు పోటాపోటీగా సిట్‌లు ఏర్పాట్లు చేయడంతో డేటా వార్ ఎక్కడికి దారితీస్తుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది.




First published: March 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...