పి.ఆనంద్ మోహన్, విశాఖపట్నం, న్యూస్ 18, Dussehra Navaratri 2021: హిందూ సంప్రదాయం ప్రకారం, శరన్నవరాత్రుల (Sharan navaratri celebrations)సమయంలో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని కొలుస్తారు. చెడుపై మంచి విజయం సాధిస్తుంది అనడానికి నిదర్శనంగా దసర పండుగ (Dasara Celbrations)ను దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం దుర్గాదేవి (Durga Devi)రాక్షసుడిని సంహరించిన రోజు అని, మరోవైపు రాముడు రావణాసురుడిని అంతమొందించిన రోజును వేడుక చేసుకునే పండుగ దసరా. దేశ వ్యాప్తంగా ఈ దసరా ఉత్సవాలను చాలా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ దసరా శరన్నవరాత్రి సందర్భంగా విశాఖపట్నం (Visakhapatnam)లోని సాగర గిరి కనక దుర్గ దేవి (Sagara Giri Kanaka Durga)ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా భక్తలచే విశేష పూజలు అందుకుంటు సాగరానికి కూత వేటు దూరంలో దుర్గ బీచ్ కొండ (Beach Hills)పై కొలువై ఉన్న శ్రీ సాగర గిరి కనక దుర్గమ్మ లీలలు కనులారా వీక్షించిన జన్మధన్యంవుతుందని అక్కడి భక్తుల నమ్మకం. అందుకే ప్రతి ఏడాది దసరా ఉత్సవాల్లో ఇక్కడి అమ్మవారు చాలా ప్రత్యేకంగా నిలుస్తూ వస్తున్నారు..
శ్రీ సాగర గిరి కనక దుర్గ ప్రత్యేకత
స్వతంత్ర్యానికి ముందు ఇప్పుడు విశాఖపట్నంగా పిలవబడే అప్పటి వైశాఖలో దాదాపు 50 సంవత్సరాల క్రితం అంటే 1972 లో విశాఖపట్నం పోర్టు (Visakhapatnam Port)నిర్మాణంకోరకు సముద్ర మార్గంలో రాళ్ళ వంతెనను పశ్చిమ బెంగాలి (West Beangal), పంజాబ్ (Panjub)తో పాటు ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh)కి చెందిన ముగ్గురు గుత్తేదారులు కలసి నూతన పోర్ట్ నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో పోర్ట్ కెనాల్ మార్గంలో శ్రీ సాగర గిరి కనక దుర్గ అమ్మవారు నలుపు రంగు కలిగి రాతి విగ్రహం రూపంలో బయట పడ్డారు.
ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్య శిక్షణకు మైక్రోసాఫ్ట్.. 1.62 లక్షల విద్యార్ధులకు శిక్షణ.
పోర్ట్ నిర్మాణ పనులు చేపడుతున్న ముగ్గురు కాంట్రాక్టర్లు అమ్మవారి విగ్రహానికి నమస్కరించి అమ్మవారి విగ్రహాన్ని పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఉంచి నిర్మాణ పనులు ముమ్మరంగా మొదలెట్టారు. అయితే అదే సమయంలో అమ్మవారు భక్తుల కలలో కనిపించి సాగరానికి అనుకుని ఉన్నటువంటి కొండపై తన విగ్రహాన్ని నెలకొల్పి గుడి కట్టి పూజలు చేయాలని కోరినట్టు కథనాలు చెబుతున్నాయి. మరునాడు ఉదయాన్ని అక్కడకు చేరుకున్న అప్పటి పోర్ట్ ట్రస్ట్ చైర్మన్, కాంట్రాక్టర్లు హుటాహుటిన దుర్గ బీచ్ కొండపై అమ్మవారికి ఆలయంలో నిర్మించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దింతో పోర్ట్ నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సకాలంలో పనులు పూర్తి చేసుకున్నాయని పూర్వీకులు చెబుతారు.
అప్పటిలో రోడ్డు మార్గం లేకపోవడంతో టౌన్ కొత్తరోడ్డు నుండి పోర్ట్ వరకు నడక మార్గంలో వెళ్లిన భక్తులు ఇటు వైపు నుండి అటు వైపుకు బోటు ద్వారా 25 పైసలు చెల్లించి అమ్మవారిని దర్శించుకునే వారు. అలా ఆ నోటా ఈ నోటా అమ్మవారి లీలలు తెలియడంతో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ వస్తున్నారు. శ్రీ కనక దుర్గ అమ్మవారు సాగరం ద్వారా బయటపడటం (గిరి అనగా కొండ) కొండపై కొలువు దీరడంతో అమ్మవారికి శ్రీ సాగర గిరి కనక దుర్గ అని పేరు వచ్చిందని భక్తులు చెబుతారు. గతంలో బోటు ద్వారా వెళ్ళి ప్రతి నిత్యం భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేవారు..
ఇదీ చదవండి: మళ్లీ తప్పని కరెంటు కోతలు..! ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఇదే
సముద్ర జలంతో అభిషేకం
క్రమేపీ పోర్ట్ రద్దీ పెరగడంతో బోటు పర్మిషన్ లేనందున భక్తుల తాకిడి తగ్గుముఖం పట్టింది. కానీ భక్తుల కోసం దసరా నవరాత్రుల్లో ప్రత్యేకంగా పోర్టు యాజమాన్యం బోటు ఏర్పాటు చేస్తుంది. నవరాత్రుల తరువాత 10 వ రోజున అమ్మవారిని కొండపై నుండి కిందకు తీసుకువచ్చి సముద్రంలో తెప్పోత్సవం జరిపి తరువాత సముద్ర జలంతో అమ్మవారిని అభిషేకిస్తారు.. తరువాత అమ్మవారి ఆలయంలో భక్తులకు యధావిధిగా సంవత్సర పొడుగునా అమ్మవారు దర్శనం ఇస్తారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Dussehra, Dussehra 2021, Visakhapatnam