ఎల్లుండి నుంచి శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆలయ సిబ్బంది మీడియా ప్రతినిధులకు మాత్రమే దర్శనం ఉంటుందని... ఆ మరుసటి రోజు స్థానికులు దర్శన భాగ్యం కల్పిస్తామని అన్నారు. బుధవారం నుంచి సాధారణ భక్తులను స్వామివారిని దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి సూచనలు, జాగ్రత్తలు పాటించాలనే అంశాన్ని ఆలయ ఈవో వివరించారు. లడ్డు,పులిహోరా ప్రసాదాల విక్రయాలు యథాతథంగా కొనసాగుతాయని అన్నారు. తలనీలాలు సమర్పణ కూడా కలదు క్షురకులకు తగిన జాగ్రత్తలు పిఈపి సెట్టు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుందని ఈవో చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఏ రాష్ట్రం నుంచి అయినా భక్తులు శ్రీకాళహస్తీశ్వర దర్శనానికి రావచ్చని స్పష్టం చేశారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్ ఖచ్చితంగా తీసుకురావాలని అన్నారు. స్వామివారి దర్శనార్థం గంటకు 300 మంది భక్తులను మాత్రమే అనుమతి ఇస్తామని అన్నారు. అభిషేకాలు ఉచిత ప్రసాదాలు శఠగోపాలు హారతులు అంతరాలయ దర్శనాలు ఆశీర్వచనాలు రద్దు చేసినట్టు తెలిపారు. శ్రీకాళహస్తిలో ప్రత్యేకంగా నిర్వహించే రాహుకేతువులు పూజలు యథాతథంగా జరుగుతాయని అన్నారు. వృద్ధులు, వికలాంగులు, చిన్నపిల్లలకు ఆలయ ప్రవేశము లేదని ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:June 13, 2020, 18:48 IST