గుంటూరు జిల్లాలో ఏం జరుగుతోంది? యూత్ ఎందుకు మారడం లేదు?

రాజధాని జిల్లాలో గత 5 నెలల్లో 8,682 కేసులు నమొదయ్యాయి. రూ. 87.21 లక్షలు జరిమానా వసూలు చేశారు. అందులో 65శాతం మంది యువతే ఉన్నారు.

news18-telugu
Updated: June 22, 2019, 9:59 PM IST
గుంటూరు జిల్లాలో ఏం జరుగుతోంది? యూత్ ఎందుకు మారడం లేదు?
గుంటూరు
  • Share this:
రాత్రి 11గంటలు. వెంకటేశ్వర రావు ఆందోళనగా గడియారం వైపు, మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉన్నాడు. బీటెక్ చదివే తన కొడుకు స్నేహితుడి పుట్టిన రోజు పార్టీకి వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. అతడి కోసం వెంకటేశ్వరరావు ఎదురుచూస్తున్నాడు. అంతలో ఫోన్ మోగింది. వేంకటేశ్వర రావు మనసులో కీడు శంకించింది. అదే నిజమైంది. ‘మీ కొడుకు మద్యం తాగి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు.’ అని అవతలి వ్యక్తి చెప్పాడు. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వారిలో మద్యం తాగి వాహనాలను నడిపేవారి సంఖ్య అధికంగా ఉన్నట్లు పోలీస్ శాఖ నివేదికలు చెపుతున్నాయి. వారిలో యువత అత్యధికంగా ఉండటం ఎంతో ఆందోళనకు గురిచేస్తుంది. యువత, విద్యార్థులు మద్యానికి అలవాటు పడటం కలవరపరుస్తుంది. డాక్టర్లు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నా యువత మద్యానికి బానిసలవుతున్నారు. ఇలా మద్యం తాగి జరిగిన ప్రమాదాల్లో యువత తమ బంగారు భవిష్యతును అంథకారంలోకి నెడుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా గుంటూరు జిల్లాలో పోలీస్, రవాణా శాఖ అధికారులు మోటర్ వెహికిల్ చట్ట ప్రకారం బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించటం ప్రారంభించారు. మద్యం తాగినట్లు తెలితే వారిపై కేసులు నమోదు చేసి ఫైన్ వేస్తున్నారు.

drunken woman, drunken woman in hyderabad, drunken woman cases, drunken woman cases in telangana. drunk and drive cases, drunk and drive cases in hyderabad, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్, హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ మహిళ హంగామా,
ప్రతీకాత్మక చిత్రం


రాజధాని జిల్లాలో గత 5 నెలల్లో 8,682 కేసులు నమొదయ్యాయి. రూ. 87.21 లక్షలు జరిమానా వసూలు చేశారు. అందులో 65శాతం మంది యువతే ఉన్నారు. దీంతో నిబంధనలు కఠినతరం చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గతంలో మద్యం తాగి పట్టుబడితే కేవలం జరిమానా చెలిస్తే వదిలివేసేవారు. ఇప్పుడు వాహనాలు సీజ్ చేస్తున్నారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తున్నారు. వారికి స్పెషల్ డ్రెస్సులు ఇచ్చి, పోలీసులతో పాటు ట్రాఫిక్ విధులు, సమాజ సేవ చేయిస్తున్నారు. అయితే, ఇంత చేసినా కేసుల సంఖ్య తగ్గకపోవడం గమనించాల్సిన అంశం.

(అన్నా రఘు, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: June 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>