Home /News /andhra-pradesh /

Visaha vs Delhi: ఆ విషయంలో ఢిల్లీతో పోటీ పడుతున్న విశాఖపట్నం.. భయపడుతున్న జనం

Visaha vs Delhi: ఆ విషయంలో ఢిల్లీతో పోటీ పడుతున్న విశాఖపట్నం.. భయపడుతున్న జనం

ఢిల్లీలో పోటీ పడుతున్న వైజాగ్

ఢిల్లీలో పోటీ పడుతున్న వైజాగ్

Danger Bells: స్మార్ట్ సిటీ.. సేఫెస్ట్ సిటీ.. ఏపీకి కాబోయే రాజధాని.. ప్రముఖ పర్యాటక ప్రాంతం.. ఇలా విశాఖ పట్నానికి ఎన్నో గుర్తింపులు ఉన్నాయి. కానీ మరో కోణంలో చూస్తే భయపడే పరిస్థితులు పెరుగుతున్నాయి. ఇంతకీ ఆ డేంజర్ బెల్స్ ఏంటో తెలుసా..?

ఇంకా చదవండి ...
  Danger Bells:  విశాఖపట్నం.. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏపీకి కాబోయే రాజధాని.. ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న ప్రముఖ పర్యాటక ప్రాంతం.. స్మార్ట్ సిటీ..   ఐటీ హబ్ గా ఎదుగుతున్న నగరం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అదే స్థాయిలో మరో భయం వెంటాడుతోంది. అందే విశాఖపట్నం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటోంది.  విశాఖ నగరంలో కాలుష్య తీవ్రత నానాటికీ పెను సవాలుగా మారుతోంది. శీతాకాలం వచ్చిందంటే ధూళి రేణువుల తీవ్రత పెరుగుతోంది. నవంబరు నెల నుంచి మార్చి నెలాఖరు వరకు ఇది కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

  పారిశ్రామికంగా గుర్తింపు పొందిన విశాఖలో తొమ్మిది చోట్ల గాలి స్వచ్ఛతను కొలిచే పరికరాలను ఏర్పాటుచేసి వివిధ కాలుష్య కారకాల తీవ్రత ఏస్థాయిలో ఉందో పరిశీలిస్తున్నారు. ప్రతిరోజూ నమోదయ్యే ఆ విలువలను నెలలో తొమ్మిది రోజులపాటు విశ్లేషిస్తుంటారు. సల్ఫర్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌, అమ్మోనియా, పి.ఎం.2.5, పి.ఎం.10 విలువల తీవ్రతను బట్టి కాలుష్య తీవ్రత ఎలా ఉందన్నది తెలుస్తుంది. మిగిలిన కాలుష్య కారకాల తీవ్రత పరిమితి కన్నా తక్కువే ఉన్నప్పటికీ పి.ఎం.10 తీవ్రత మాత్రం అధికంగా ఉంటోంది.

  ‘పార్టిక్యులేట్‌ మేటర్‌’(పి.ఎం.)-10 అంటే పది మైక్రాన్ల వరకు పరిమాణంలో ఉండే దుమ్ము, ధూళి రేణువులు. నగరంలో ఆయా రేణువుల తీవ్రత అధికంగా ఉంటోంది. విశాఖ నౌకాశ్రయం నుంచి వచ్చే కాలుష్యం, రహదారులపై దుమ్ము, ధూళి పోగువ్వడం, వాహనాల సంచారం అధికంగా ఉండడం తీవ్రతను పెంచుతోంది. విశాఖ నౌకాశ్రయంలోని స్టాక్‌యార్డుల్లో వేల టన్నుల్లో ఇనుప ఖనిజం, బొగ్గు నిల్వలను ఉంచుతున్నారు. అక్కడి నుంచి ధూళి రేణువులు నగరంలోకి ప్రవేశిస్తున్నాయి.

  నగరంలో నిత్యం లక్షల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఒక్క జాతీయ రహదారిపైనే వేలాది భారీవాహనాలు తిరుగుతున్నాయి. ఇక ద్విచక్ర వాహనాలు, కార్ల సంఖ్యకైతే కొదవేలేదు. వాటి పొగగొట్టాల నుంచి కూడా తీవ్రమైన కాలుష్యం విడుదలవుతోంది. నగరంలోని పలు రహదారులు దెబ్బతిని గుంతలు పడడం కూడా కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి. అలాంటి రహదారులపై ఎక్కవ పరిమాణంలో దుమ్ము, ధూళి రేణువులు పేరుకుపోతున్నాయి.

  మరోపక్క వేగంగా పెరుగుతున్న జనాభా, ఇతర ప్రాంతాలనుండి జీవనోఫాదికై వలసవచ్చే ప్రజలతో విశాఖ నిండుతోంది. ఇక్కడి ప్రజలు కాలుష్యం, అనారోగ్యం అనే రెండు ప్రధాన సమస్యలతో సతమవుతున్నారు. గోపాలపట్నం, మల్కాపురం, కంచెరపాలెం, మర్రిపాలెం, ఎన్ ఏడి జంక్షన్లు విశాఖ పశ్చిమాన ఉన్న ప్రాంతాలు. ఈ ప్రాంతాలలో వాహనాలనుండి వచ్చే కాలుష్యంతో బాటు, దాదాపు 300 కు పైగా ఉన్న ఆసుపత్రులు, డిస్పెన్సరీల నుండి వాడేసిన మెడికల్ వేస్ట్, పరిశ్రమల , కంపెనీల నుండి వెలువడే వ్యర్దాలు, ఇంకా ఇండ్ల నుండి సేకరించిన చెత్త వంటి వాటిని మహానగరపాలకసంస్థ కాపుల ఉప్పాడ ప్రాంతంలో విసర్జిస్తున్నది.

  ఈ పని శాస్త్రీయ పద్దతులలో జరగకపోవడంతో వాటినుండి వెలువడే కాలుష్యం విషతుల్యంగా మారుతోంది.  దీనివలన భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం కావడంతో బాటు, భవిష్యత్తులో మంచినీటి కొరత తీవ్రతరం చేస్తుందని అనేక పరిశోధనా పత్రాలు చెబుతున్నాయి. కాలుష్య తీవ్రతను గుర్తించి తగిన పరిష్కార చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్రత మరింత పెరిగే ముప్పు పొంచి ఉంది. పచ్చదనం పరిమాణం పెరిగితే ధూళిరేణువుల ప్రవాహాన్ని చెట్లు కొంత వరకు నియంత్రించగలుగుతాయి.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Delhi, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు