DANGER BELLS FOR ANDHRA PRADESH ASANI CYCLOE EFFECT UTTARANDHRA DISTRICT MUST ALERT NGS VSP
Cyclone Asani: ఈ 12 గంటలకు బీ అలర్ట్.. హుద్ హుద్ తరువాత అంత ప్రమాద హెచ్చరిక ఇదే
ప్రతీకాత్మకచిత్రం
Cyclone Asani:ఏపీకి డేంజర్ బెల్ మోగింది.. అసాని రూపంలో తుపాను ఏపీని భయపెడుతోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ దిశ మార్చుకుని రాష్ట్రంపై విరుచుకుపడే అవకాశం ఉంది.. అయితే 2014 లో హుద్ హుద్ తరువాత.. 13వ నెంబర్ హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి అంటోంది వాతావరణ శాఖ..
Cyclone Asani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను తుఫాను ముప్పు భయపెడుతోంది. తాజాగా బంగాళఖాతంలో అసని తుఫాను (Asani Cyclone) తీవ్ర రూపం దాల్చింది. మంగళవారం మధ్యాహ్నానికి దిశ మార్చుకున్న తుఫాను.. ప్రస్తుతం గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం కాకినాడ (kakinada)కు 210 కిలోమీటర్లు, విశాఖపట్నం (Visakhapatanam)కు 310 కిలోమీటర్లు, గోపాలపూర్ (Gopalpur) కు 530 కిలోమీటర్లు, పూరీకు 630 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం వాయువ్య దిశగా పయనించి..బుధవారం ఉదయానికి కాకినాడ-విశాఖపట్నం తీరాలకు దగ్గరగా చేరుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే అసని తుఫాను నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. అలాగే ఉమ్మడి గుంటూరు (Guntrur), కృష్ణ (Krishna), ఉభయ గోదావరి (Godavari Districts), విశాఖ జిల్లా (Visakha District)లకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తీవ్ర తుఫానుగా అసని రూపాంతరం చెందిందని వాతావరణశాఖ అధికారి తెలిపారు.
తుఫాను కాకినాడ విశాఖపట్నం మధ్య తీరానికి దగ్గరగా వచ్చి మళ్లీ తీరం వెంబడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగాళఖాతంలోకి వెళుతుందంటున్నారు. తుఫాను ప్రభావంతో బలమైన గాలులు వీస్తాయని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరం వెంబడి సుమారుగా 48 నుంచి 68 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచరిస్తున్నారు. అలాగే కాకినాడ తీరం నుంచి విశాఖ తీరం వరకు ఉన్న తీరప్రాంతంలోని ఓడరేవుల్లో పదో నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మిగిలిన ఓడరేవుల్లో 8 వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
అయితే విశాఖ తీరంలో 13వ నెంబర్ హెచ్చరిక జారీ చేయడం ఆందోళన పెంచుతోంది. 2014లో హుద్ హుద్ తుఫాను బీభత్సం తర్వాత విశాఖ తీరానికి 13 నెంబర్ హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారి అంటారు. ఈ రోజురాత్రి నుంచి ఉమ్మడి కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. రేపు ఉత్తరాంధ్రలో వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు, ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని.. సహాయక చర్యలకు SDRF, NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.